NTV Telugu Site icon

Rahul Gandhi: నవయుగ రావణ్‌ రాహుల్.. బీజేపీ పోస్ట్‌ వైరల్, కోర్టుకెళ్లిన కాంగ్రెస్

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లంకాధిపతి రావణుడి అవతారంలో ఉన్న రాహుల్‌ గాంధీ ఫోటోను షేర్‌ చేస్తూ బీజేపీ వివాదాస్పద క్యాప్షన్‌ను జోడించింది. నవయుగ రావణుడిగా రాహుల్‌ను చూపిస్తూ బీజేపీ సోషల్‌ మీడియా పోస్ట్‌పై ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆ వివాదాస్పద పోస్ట్‌పై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఐటీ సెల్‌ ఇంఛార్జి అమిత్‌ మాల్వియాపై కాంగ్రెస్ నాయకుడు జస్వంత్ గుర్జార్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Also Read: India-Canada Row: ఇండియా-కెనడా వివాదంపై స్పందించిన రిషి సునాక్.. ఏమన్నారంటే..?.

ఇద్దరు బీజేపీ నేతలపై ఐపీసీ సెక్షన్ 499 (మరొకరిపై తప్పుడు అభియోగం), 500 (పరువు నష్టం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ రాజస్థాన్ యూనిట్ ప్రధాన కార్యదర్శి జస్వంత్ గుర్జార్ తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. జైపూర్ మెట్రోపాలిటన్ కోర్టు-11లో జస్వంత్ గుర్జార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అక్టోబర్ 9న వాదనలు వినాలని కోర్టు నిర్ణయించింది. ఎక్స్‌ ఒకప్పుడు ట్విట్టర్‌లో బీజేపీ అధికారిక హ్యాండిల్‌ నుంచి పోస్ట్ చేయబడిన ఒక పోస్టర్‌లో రాహుల్ గాంధీ ఫోటోను రావణుడిగా చూపించడంవివాదాన్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటల యుద్ధం జరిగింది. ఇది ఆమోదయోగ్యం కాదు, నిస్సందేహంగా ప్రమాదకరమైనది అని కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలను రేకెత్తించింది.

Also Read: Russia: కిమ్-పుతిన్ భేటీ తర్వాత పెరిగిన రైళ్ల రాకపోకలు.. కారణం అదేనా..?

పిటీషన్‌ను కోర్టు అంగీకరించిందని, కేసు విచారణను అక్టోబర్ 9 న షెడ్యూల్ చేయబడిందని జస్వంత్ గుర్జార్ చెప్పారు. అక్టోబరు 5న నిందితుడు ఉద్దేశపూర్వకంగా పోస్ట్‌ను దురుద్దేశంతో ప్రచారం చేశాడని, నిందితుడి లక్ష్యం కాంగ్రెస్, దానితో సంబంధం ఉన్న వ్యక్తుల చిత్తశుద్ధిని అవమానించడం, దెబ్బతీయడం, రాజకీయ లబ్ధి పొందడం అని పిటిషన్‌లో పేర్కొనబడింది. బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా రాహుల్‌ గాంధీని రాముడికి వ్యతిరేకిగా, మత విరోధిగా చిత్రీకరించి ప్రజలను రెచ్చగొట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. నిందితులిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసి విచారణ జరిపించాలని పిటిషనర్‌ కోర్టుకు విన్నవించారు. ఈ పోస్టర్‌పై దేశవ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది.

“భారత్ ఖత్రే మే హై – కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్. జార్జ్ సోరోస్ దర్శకత్వం వహించాడు” అనే టైటిల్‌తో గాంధీని పోస్టర్‌లో అనేక మంది తలలు చూపించారు.’నవయుగం రావణుడు వచ్చాడు. అతడు దుర్మార్గుడు. ధర్మ వ్యతిరేకి. రాముడి వ్యతిరేకి. భారత్‌ను నాశనం చేయడమే అతని లక్ష్యం’ అని పోస్టర్‌తో పాటు బీజేపీ పోస్ట్ చేసింది. హంగేరియన్‌లో జన్మించిన అమెరికన్ ఫైనాన్షియర్, పరోపకారి, కార్యకర్త అయిన జార్జ్ సోరోస్, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నుంచి నిప్పులు చెరిగారు.