Site icon NTV Telugu

Kishan Reddy: ముఖ్యమంత్రికి రైతులకంటే.. ఎన్నికలే ముఖ్యంగా మారింది..!

Kishan Reddy

Kishan Reddy

Congress govt: యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ మండలం రాఘవపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పరిశీలించారు. కొనుగోలు ఆలస్యం కావడానికి గల కారణాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. 45 రోజులు గడుస్తున్న కొనుగోలు ప్రక్రియ పూర్తికాక పోవడం.. కొనుగోలు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని కిషన్ రెడ్డి దగ్గర రైతులు మొర పెట్టుకున్నారు. ఎప్పటికీ కొనుగోలు పూర్తి అవుతుందో తెలియడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 45 రోజులుగా IKP కేంద్రానికి ధాన్యం వస్తున్న.. కొనుగోలు ప్రక్రియ వేగంగా జరగడం లేదన్నారు. IKP కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవు.. కొనుగోలు ప్రక్రియలో ప్రతి దశకు కేంద్రం డబ్బులు చెల్లిస్తుంది.. అయినా కొనుగోలు సరిగ్గా జరగడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also: Mexico Stage Collapse : మెక్సికోలో స్టేజ్ కూలి తొక్కిసలాట.. ఐదుగురు మృతి, 50మందికి పైగా గాయాలు

సీఎంకు రైతులకంటే.. ఎన్నికలే ముఖ్యంగా మారింది అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుంది.. కేసీఆర్ వరి వేస్తే ఊరి అన్నారు.. రేవంత్ రెడ్డి దొడ్డు వడ్లు వేస్తే బొనస్ ఇవ్వము అంటున్నారు.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.. రుణమాఫీ లేదు.. బోనస్ లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. దేవుడి మీదు ఒట్టు పెడితే రైతుకు న్యాయం జరగదు.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి గింజ కొనడానికి సిద్ధంగా ఉంది అని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Exit mobile version