Site icon NTV Telugu

Prajwal rape victims: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఆర్థిక సాయం

Cke

Cke

మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. బెళగావిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ జనరల్‌ సెక్రటరీ, ఆ రాష్ట్ర ఇంఛార్జ్‌ రణ్‌దీప్‌ సుర్జేవాలా ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల సమక్షంలో ఈ ప్రకటన చేశారు.

ఇది కూడా చదవండి: Geetha Bhagath: హీరో కడతాడని చీర కట్టుకు రాలేదు.. యాంకర్ షాకింగ్ కామెంట్స్

బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయించారని సుర్జేవాలా వెల్లడించారు. బాధితులు వందల సంఖ్యలో ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు. ఇది భిన్నమైన కేసు అని.. గడిచిన 75 ఏళ్లలో ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదు అని సుర్జేవాలా తెలిపారు. నిందితులపై సరైన చర్యలు తీసుకోవాలని రాహుల్‌ గాంధీ కూడా డిమాండ్‌ చేశారన్నారు. బీజేపీ కూటమిలో జేడీఎస్‌ ఉన్నందున.. వారిని రక్షించేందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజ్వల్‌కు సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని బీజేసీని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Drug racket: మహారాష్ట్రలో డ్రగ్ రాకెట్ గుట్టురట్టు.. భారీగా డ్రగ్స్ సీజ్

ప్రజ్వల్‌ దేశం విడిచి పారిపోకుండా విదేశాంగ శాఖ ఎందుకు అడ్డుకోలేక పోయిందని కాంగ్రెస్‌ నేతలు నిలదీశారు. నిందితుడికి ఉన్న దౌత్య పాస్‌పోర్టును ఇంకా ఎందుకు రద్దు చేయలేదని, అతడిని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ఇంటర్‌పోల్‌ ద్వారా నోటీసులు ఎందుకు ఇవ్వలేదన్నారు. సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ప్రజ్వల్‌ను స్వదేశానికి రప్పించేందుకు బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేస్తామన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా దర్యాప్తు సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాధితుల కోసం ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఎవరైనా ప్రజ్వల్ రేవణ్ణ బాధితులు ఉంటే హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపింది. ఇందుకోసం హెల్ప్‌లైన్ నెంబర్ 6360-938947 గా సిట్ పేర్కొంది. ఈ నెంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Dulam Nageswara Rao: ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు..

Exit mobile version