NTV Telugu Site icon

Raghunandan Rao: కాంగ్రెస్ ప్రభుత్వం సందిగ్ధంలో ఉంది..

Raghunandan

Raghunandan

వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సందిగ్ధంలో ఉందన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులను మోసం చేసి ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ జిల్లాలో సన్న బియ్యం ఎంతో.. దొడ్డు బియ్యం ఎంతో డిప్యూటీ సీఎం భట్టి ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఈ జిల్లాకు ఒక యునివర్సిటీ తీసుకురాలేక పోయారని రఘునందన్ రావు ఎద్దెవా చేశారు.

Read Also: Etela Rajender: 6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అలాగే, గత ప్రభుత్వం కూడా ఇదే అహంకారంతో ఎన్నికలకు పోయి బొక్క బోర్లా పడింది.. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అదే పరిస్థితి వస్తుందని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. ఆరు నెలల క్రితం అడ్డగోలు హామిలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు.. పూటకో మాట మాట్లాడే కాంగ్రెస్ పార్టీకి చదువుకున్న విజ్ఞులు ఓటు వేయకుండా గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి కంటే అధ్వాన్నంగా ఉన్నాడు.. ముఖ్యమంత్రి పరిపాలనా అంత టీఎస్ ను టీజీగా మార్చడం.. ఫోన్ ట్యాపింగ్ లపైనే ఈ పరిపాలనా అంత కొనసాగింది అన్నారు. రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలపై స్పష్టత లేకుండా పోయింది.. ఆయన అడుగులు ముందుకు పోకుండా వెనక్కు పడుతున్నాయి.. ఓట్ల కోసం సీట్ల కోసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను రాష్ట్రానికి తేచ్చి అబద్ధాలు చెబుతున్నారు.. అధికార పార్టీ నాయకున్ని గెలిపిస్తే జోకుడు తప్ప ఇంకా ఏమి ఉండదు.. అదే బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే మీ కోసం కోట్లాడుతామని రఘునందన్ రావు వెల్లడించారు.