NTV Telugu Site icon

Congress: ప్రధాని మోడీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

Ete

Ete

ప్రధాని మోడీపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం సోమవారం ఎన్నికల సంఘాన్ని కలిసి మొత్తం 17 అంశాలపై ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని చేసిన వ్యాఖ్యల అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది.

ఇది కూడా చదవండి: Dgp Ravi Gupta: నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన డీజీపీ

రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ గెలిస్తే ఆస్తులను ముస్లింలకే ఇచ్చేస్తారంటూ వ్యాఖ్చానించారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనే అవుతుందని పేర్కొంది. ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రజల్లో విభజన తీసుకొచ్చేవిధంగా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని మోడీ మాట్లాడారని కాంగ్రెస్‌ తన ఫిర్యాదులో తెలిపింది. ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చేలా వ్యవహరించారని, తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిపింది. మతం ఆధారంగా మోడీ ఓట్లడిగారని.. విపక్ష పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా లేనిపోని నిందలు వేశారని ఫిర్యాదులో పేర్కొంది.

ఇది కూడా చదవండి: RCB vs KKR: అంపైర్ తప్పుడు నిర్ణయంతోనే ఆర్సీబీ మ్యాచ్ ఓడిందా.. వీడియో వైరల్..

ఇక సూరత్‌లో ఎన్నిక వాయిదా వేయాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడం.. నలుగురు కాంగ్రెస్ నేతలు మిస్ అయ్యారని తెలిపింది. దీంతో సూరత్‌లో ఎన్నిక వాయిదా వేయాలని అభ్యర్థించింది. ఇక యూజీసీలో నియామకాలు చేపట్టడాన్నీ కాంగ్రెస్‌ తప్పుబట్టింది. ప్రధాని, ఆయన పార్టీ చేస్తున్న ధిక్కార, ఉద్దేశపూర్వక ఉల్లంఘనలపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. ఒకవేళ చర్యలు తీసుకోవడంలో విఫలమైతే ఎన్నికల సంఘంపై ఉన్న గౌరవానికి మచ్చ వస్తుందని అభిప్రాయపడింది.

సూరత్‌లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. అనంతరం స్వతంత్ర అభ్యర్థుల కూడా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ మేరకు బీజేపీ నేతంతా సంబరాలు చేసుకున్నారు. బీజేపీ గెలిచిన తొలి సీటు అంటూ నేతలు చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Tenth Topper: ‘టెన్త్’ ఫలితాల్లో సరికొత్త రికార్డు.. 599 మార్కులతో ‘టాప్’ లేపిన మనస్వి..