తమ మేనిఫెస్టో గురించి వివరించేందుకు ప్రధాని మోడీతో సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల సమయం అడిగారు. దీనిని ఉద్దేశించి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలకు ఖర్గే ఘాటుగా సమాధానం ఇచ్చారు. అస్సాంలో మీడియా సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మాట్లాడుతూ.. నేను మోడీతో మాట్లాడతాను.. తప్పా సీఎంతో కాదన్నారు. నేను రాజ్యసభలో ప్రతిపక్ష నేతను.. లోక్‌సభకు కూడా ప్రాతినిధ్యం వహించా.. పార్లమెంటరీ వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన ఉంది.. మరి అప్పుడు నా ప్రత్యర్థి మోడీనే కాబట్టి.. నేను ఆయనతోనే మాట్లాడతాను అంటూ పేర్కొన్నారు. మధ్యలో ఈయన (సీఎం హిమంత బిశ్వశర్మ) ఎందుకు అంత బాధ పడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. అస్సాంలో మా వాళ్లను ఎదుర్కొని, నా గురించి మాట్లాడితే బెటర్ అంటూ మల్లికార్జున ఖర్గే చురకలు అంటించారు.
Read Also: Salman Khan: సల్మాన్ ఖాన్ కేసులో కీలక పరిమాణం.. పోలీసుల సంచలన నిర్ణయం
ఇక, ఇటీవల ప్రధాని మోడీకి రాసిన లేఖలో భేటీకి సమయం అడిగారు. దానిపై అస్సాం సీఎం హిమంత స్పందిస్తూ.. ప్రధాని మోడీకి ఇంగ్లీష్ వస్తది.. మీరు మేనిఫెస్టోను హిందీ, ఇంగ్లీష్‌ల్లో రిలీజ్ చేశారు.. ఇంకా దానిపై మాట్లాడటం ఎందుకు..? అని ఖర్గేను ప్రశ్నించారు. అయినా, ఖర్గే బీజేపీతో ఎందుకు భేటీ అవుతున్నారు.. ఒకవేళ ఆయన బీజేపీలో చేరాలనుకుంటే.. రావొచ్చంటూ బిశ్వశర్మ కామెంట్స్ చేశారు. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు.
