NTV Telugu Site icon

Congress: నేడే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్ పూర్ లో బహిరంగ సభ..

Congress

Congress

Nagpur: ఇవాళ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో భారీ బహిరంగ సభకు పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కూడా హాజరు కాబోతున్నారు. అలాగే పార్టీ సీనియర్ నేతలతో పాటు ఇండియా కూటమి నేతలు సైతం ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు వస్తుండటంతో ఏఐసీసీ ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది.

Read Also: YV SUbba Reddy: వైసీపీ టార్గెట్‌ అదే.. అందుకే ఈ మార్పులు..!

కాగా, ఈ ఆవిర్భావ దినోత్సవ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తరలి వెళ్తున్నారు. సుమారు 10 లక్షల మంది ఈ సభలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. అయితే, తెలంగాణ నుంచి 50 వేల మంది కార్యకర్తలు వెళ్తున్నట్లు టాక్. ప్రతి నియోజకవర్గం నుంచి సభకు వెళ్లే కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వెహికిల్స్ ను రెడీ చేసింది.

Read Also: Nampally Exhibition: నాంపల్లిలో జనవరి 1 నుంచి నుమాయిష్‌.. టికెట్‌ ధర ఎంతంటే..?

అయితే, ఈ సభను సక్సెస్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సభకు జనసమీకరణ కోసం మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేశారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ప్రత్యేక విమానంలో నాగ్ పూర్ చేరుకోబోతున్నారు.

Read Also: Vijayakanth: మార్కెట్ కోసం ఇతర భాషల్లో సినిమాలు చేయని ఏకైక తమిళ స్టార్

మరోవైపు గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాల్సి ఉండగా.. ఆయన నాగ్ పూర్ కు వెళ్తుండటంతో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సేవాదళ్ ఆధ్వర్యంలో గాంధీభవన్ నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరా భవన్ వరకు భారీ ర్యాలీ తీయనున్నారు.