NTV Telugu Site icon

Revanth Reddy: సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో.. కార్యకర్తలకు కీలక పిలుపు

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ భవిష్యత్‌కు యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అంటూ.. హైదరాబాద్ సోమాజిగూడలోని కత్రియా హోటల్లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో ఆయన పాల్గొని రేవంత్ రెడ్డి మాట్లాడారు. నాయకుడుగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక వేదిక అని.. ఇందుకు కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే మనకు ఉదాహరణ కార్యకర్తలకు సూచించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో డేట్‌ను రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 న కాంగ్రెస్ పార్టీ మేని‌ఫెస్టో రిలీజ్ చేస్తున్నామని పేర్కొన్నారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదిన కానుకగా కాంగ్రెస్ గెలుపును అందిద్దామని అన్నారు. 1200 మంది విద్యార్థి, యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు.

Read Also: Ponguleti: సమాధానం చెప్పే రోజు వస్తుంది.. పువ్వాడ పై బగ్గుమన్న పొంగులేటి..

డబుల్ ఇంజిన్ అంటే అదానీ, ప్రధాని అని.. దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజిన్ పని అంటూ విమర్శలు గుప్పించారు. వన్ నేషన్ వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని.. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం మీరంతా కష్టపడాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేలా కృషి చేయాలని.. డిసెంబర్ 9న సోనియా జన్మదినం సందర్భంగా గెలుపును ఆమెకు కానుకగా ఇద్దామని కార్యకర్తలకు తెలిపారు.

Read Also: Gangula Kamalakar: కాంగ్రెస్, బీజేపీని గెలిపిస్తే కాళేశ్వరాన్ని బద్దలుకొట్టి నీళ్లు ఎత్తుకుపోతారు..

కేసీఆర్, మోడీ లాంటి నియంతల పాలన అంతం చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ధరణి పోర్టల్ గడీల పాలన కోసం తెచ్చారని ఆయన ఆరోపించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసింది భూమి కోసమేనని.. ఆ భూముల మీద దొరల పెత్తనం ఆగకపోతే నక్సల్ బరి ఉద్యమం వచ్చిందని రేవంత్ చెప్పారు. పట్టణ బాట పట్టిన దొరల కోసం ధరణి కేసీఆర్‌ ధరణి తెచ్చారని రేవంత్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని రద్దు చేస్తామని రేవంత్ ప్రకటించారు. అసలు ధరణికి, రైతుబంధుకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. ధరణి రద్దు అయితే రైతుబంధు రాదని కేటీఆర్, కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని రేవంత్ ఆరోపించారు.

Show comments