NTV Telugu Site icon

World Cup2023: పాక్ పై గెలిచిన టీమిండియా.. ప్రధాని మోడీ ప్రశంసల వర్షం

Modi

Modi

వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో పాకిస్తాన్‌ జట్టును ఎనిమిదో సారి టీమిండియా చిత్తు చేసింది. వన్డే ప్రపంచకప్-2023 భాగంగా నిన్న (శనివారం) అ‍హ్మదాబాద్‌ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌లో అదరగొట్టింది.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా దుమ్మురేపింది. మొదటి బ్యాటింగ్‌ చేసిన పాక్.. భారత బౌలర్ల దాటికి 191 రన్స్ కే చాపచుట్టేసింది.

Read Also: Bathukamma: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు..

ఇక, టీమిండియా బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీసుకున్నారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. హిట్‌మ్యాన్‌ 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86 రన్స్ చేశాడు. అతడితో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ హాఫ్ సెంచరీలో చెలరేగిపోయాడు.

Read Also: CM KCR: పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గాల ఇంచార్జీలతో కేసీఆర్ సమావేశం

అయితే, వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌కు మరోసారి ఓడిపోవడంతో భారత జట్టుపై సర్వాత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ సారధ్యంలోని టీమిండియాను భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినంధించారు. భారత ఘన విజయం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై భారత జట్టు అద్భుత విజయం సాధించింది.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ప్రత్యర్ధి జట్టును మట్టికరిపించిన జట్టుకు నా అభినందనలు.. మిగితా మ్యాచ్‌ల్లో కూడా ఈ తరహా ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నా.. అల్‌ ది బెస్ట్‌ టీమిండియా అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్‌లో(ఎక్స్‌) రాసుకొచ్చారు.