Bathukamma: ప్రకృతిని ప్రేమించి పూజించడమే బతుకమ్మ. పచ్చదనంతో జీవించే చల్లదనాన్ని ప్రసాదించే పండుగ ఇది. తొలిరోజు బతుకమ్మ నృత్యంతో పల్లెల నుంచి తెలంగాణ పట్టణం వరకు ప్రజలు నృత్యాలు చేశారు. అంబరం తాకేలా బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. ప్రకృతితో మమేకమై ఆడుతూ పాడటమే బతుకమ్మ. ప్రకృతిని పూలతో పూజించడమే బతుకమ్మ పండుగ. వరంగల్‌లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు ఒక్క పువ్వు అంటూ బతుకమ్మ ఆడతారు. తొలిరోజు అంగిలిపూల బతుకమ్మ సందడితో ఓరుగల్లు హోరెత్తింది. వరంగల్‌లోని హనుమకొండ వేయి స్తంభాల గుడి, ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఓ రేంజ్‌లో జరిగాయి. తెలంగాణలో బతుకమ్మ ఒక ప్రత్యేకమైన పండుగ. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని బతుకమ్మ తెలియజేస్తోంది. బతుకమ్మ అంటే ఆడపిల్లల పండుగ. దసరా పండుగను మహిళలు ఘనంగా జరుపుకుంటారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పూలతో పూజించే పండుగ ఇది.
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ పండుగ దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రకృతిలో సూర్యచంద్రులను కొలిచిన విధంగానే వివిధ రకాల పుష్పాలను కొలిచే పండుగ ఇది. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, మహిళలు గౌరమ్మను తయారు చేస్తూ బతుకమ్మలను ఆడుతూ భక్తి శ్రద్దలతో ప్రజల కష్టాలను, బాధలను పాడుతూ బతుకమ్మను చుట్టారు. అమ్మాయిలను వారి ఇళ్లకు ఆహ్వానిస్తారు మరియు కుటుంబం మొత్తం వేడుకలు జరుపుకుంటారు. లాలాపేటలో అంబరాన్నంటేలా బతుకమ్మ వేడుకలు.. లాలాపేట్ పోచమ్మ దేవాలయం ఆవరణలో స్థానిక మహిళలు, చిన్నారులు బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆలపిస్తూ తెలంగాణ ఆడబిడ్డలు అందరూ ఆనందంగా బతుకమ్మ ఆడుతూ సంబరాలు చేసుకున్నారు. వందలాది మంది మహిళలు, చిన్నారులు, యువతులు బతుకమ్మలను తయారు చేసి బతుకమ్మలను ఆడి బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు. బతుకమ్మ ఒక సామాజిక పండుగ. కుల, మత, వర్గ, వృత్తి, ప్రాంతీయ సంప్రదాయాలకు అతీతంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ వారసత్వాన్ని తెలంగాణ ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రకృతిలో లభించే అన్ని రకాల పూలను పేర్చి బతుకమ్మ ఆడతారు. గునుగు, తంగేడు, పటుకుచ్చు, బంతి, చామంతి ఇలా రకరకాల పూలతో బతుకమ్మ పేరుస్తారు.
CM KCR: పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గాల ఇంచార్జీలతో కేసీఆర్ సమావేశం