NTV Telugu Site icon

Free Condoms : కోరికలు ఆపుకోకండి.. కండోమ్స్ ఫ్రీగా తీసుకోండి

Condoms Most Expensive

Condoms Most Expensive

Free Condoms : కొత్త సంవత్సరం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై యువతకు కండోమ్‌లు ఉచితంగా అందిచనున్నారు. 18 నుంచి 25 ఏళ్ల వయసున్న వారికి కండోమ్‌లను ఫ్రీగా ఇవ్వనున్నట్లు ఇప్పటికే ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ ప్రకటించారు. ఫ్రాన్స్‌లో ఎయిడ్స్‌, ఇతర లైంగిక సంక్రమిత వ్యాధుల వ్యాప్తిని నిరోధించడమే లక్ష్యంగా ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, అవాంఛిత గర్బధారణను అరికట్టేందుకు కూడా ఉచిత కండోమ్‌లు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: Good News for Drinkers : మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యంపై పన్ను రద్దు

తొలుత 18-25 ఏళ్ల వయసు వారికే అని అక్కడి సర్కారు ప్రకటించింది. మైనర్లకు రక్షణ వద్దా? అన్న విమర్శలు రావడంతో 25 ఏళ్లలోపు మగవారు అందరికీ ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. అధ్యక్షుడు మెక్రాన్ ఆధ్వర్యంలోని సర్కారు ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని డిసెంబర్ లో తీసుకోగా, జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. మరోపక్క, లైంగిక విద్య విషయంలో ఫ్రాన్స్ మెరుగ్గా పనిచేయడం లేదని అధ్యక్షుడు మెక్రాన్ అంగీకరించారు. ‘‘థియరీ కంటే వాస్తవికత ఎంతో దూరంలో ఉంది. ఈ విషయంలో టీచర్లకు ముందుగా శిక్షణ ఇవ్వాలి’’ అని మెక్రాన్ పేర్కొన్నారు.

Read Also: BJP : 16నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. జేపీ నడ్డా పదవీకాలం పొడిగించే ఛాన్స్

2030 నాటికి ఫ్రాన్స్‌ను హెచ్‌ఐవీ కేసుల రహితంగా మార్చాలని ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫ్రాన్స్‌లో 2020-2021 లో లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్ల కేసులు 30 శాతం పెరిగాయి. అయితే 2021 లో దాదాపు 5000 కొత్త హెచ్‌ఐవీ కేసులు నమోదవడం కలవరపెట్టే అంశం. ఇదే సమయంలో పేదరికం కారణంగా చాలా మంది యువతులు, మహిళలు అవాంఛిత గర్భాలను కొనసాగించారు. ఇప్పుడు ఉచితంగా కండోమ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దాదాపు 30 లక్షల మంది బాలికలు, మహిళలు లబ్ధి పొందనున్నారు.

Read Also: Noida: ఢిల్లీ తరహాలో మరో ఘటన.. స్టూడెంట్లపైకి దూసుకొచ్చిన కారు

గతంలో 18 ఏండ్లలోపు బాలికలకు మాత్రమే ఉచితంగా గర్బనిరోధక మందులు ఇచ్చేవారు. సెక్స్‌ ఎడ్యుకేషన్‌ విషయంలో ఫ్రాన్స్‌ బాగా వెనకబడి ఉన్నదని చెప్పిన మాక్రాన్‌.. అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫ్రాన్స్‌లో ప్రతి నలుగురిలో ఒకరు కొత్త భాగస్వామితో శృంగారంలో ఉన్నప్పుడు కండోమ్‌లను అరుదుగా ఉపయోగిస్తారు. కండోమ్ లను 25 ఏళ్ల వయసు వరకు పురుషులతోపాటు, మహిళలకూ ఇస్తారు. యూత్ గ్రూప్ లకు ఇప్పటికే వీటిని పంపిణీ చేయగా, స్కూళ్లలోనూ అందుబాటులో ఉంచారు.