NTV Telugu Site icon

NTA: నీట్-యూజీ రీ ఎగ్జామ్ పూర్తి.. 1563 మంది అభ్యర్థులకు గానూ.. 813 మంది హాజరు

Neet Ss Exam

Neet Ss Exam

నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఏడు కేంద్రాల్లో 1563 మంది విద్యార్థులు రీ ఎగ్జామినేషన్ కు హాజరుకావాల్సి ఉండగా..అందులో 813 మంది (52 శాతం) పరీక్ష రాశారు. 750 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఈ మేరకు సాయంత్రం ఎన్టీఏ (NTA) డేటా విడుదల చేసింది. నీట్-యూజీ పరీక్షా పత్రం లీక్ అయిన తర్వాత.. నీట్ ఫలితాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు ఈరోజు (జూన్ 23)న రీ-ఎగ్జామ్ నిర్వహించారు. పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.20 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన విషయం సంభవించింది. చాలా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 185 మంది అభ్యర్థులు రీ ఎగ్జామ్‌కు హాజరుకావాల్సి ఉండగా.. 70 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు వెలుగులోకి వచ్చింది. చండీగఢ్ లో ఇద్దరు అభ్యర్థుల కోసం మాత్రమే ఓ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరు కాలేదు.

READ MORE: Kejriwal: బెయిల్ ఆర్డర్‌ స్టేపై సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్

కాగా.. తొలుత నిర్వహించిన నీట్ పరీక్షలో ఆరు కేంద్రాల్లో పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల సమయం కోల్పోయినందుకు ఈ విద్యార్థులకు గ్రేస్ మార్కులు కేటాయించారు. మేఘాలయ, హర్యానా, ఛత్తీస్ గఢ్, గుజరాత్ లలో ఒక్కో పరీక్షా కేంద్రం సకాలంలో పరీక్షను ప్రారంభించలేకపోగా, ఛండీగఢ్‌లో రెండు కేంద్రాలు షెడ్యూల్‌ను పాటించడంలో విఫలమయ్యాయి. బాధిత అభ్యర్థులకు జూన్ 23, ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య రీ ఎగ్జామినేషన్ నిర్వహించింది.

Show comments