NTA: నీట్-యూజీ రీ ఎగ్జామ్ పూర్తి.. 1563 మంది అభ్యర్థులకు గానూ.. 813 మంది హాజరు
- చండీగఢ్ లో ఇద్దరు అభ్యర్థుల కోసం మాత్రమే ఓ పరీక్షా కేంద్రం ఏర్పాటు
- ఇద్దరూ పరీక్షకు గైర్హాజరు
- మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు కొనసాగిన పరీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఏడు కేంద్రాల్లో 1563 మంది విద్యార్థులు రీ ఎగ్జామినేషన్ కు హాజరుకావాల్సి ఉండగా..అందులో 813 మంది (52 శాతం) పరీక్ష రాశారు. 750 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఈ మేరకు సాయంత్రం ఎన్టీఏ (NTA) డేటా విడుదల చేసింది. నీట్-యూజీ పరీక్షా పత్రం లీక్ అయిన తర్వాత.. నీట్ ఫలితాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు ఈరోజు (జూన్ 23)న రీ-ఎగ్జామ్ నిర్వహించారు. పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.20 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన విషయం సంభవించింది. చాలా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 185 మంది అభ్యర్థులు రీ ఎగ్జామ్‌కు హాజరుకావాల్సి ఉండగా.. 70 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు వెలుగులోకి వచ్చింది. చండీగఢ్ లో ఇద్దరు అభ్యర్థుల కోసం మాత్రమే ఓ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరు కాలేదు.
READ MORE: Kejriwal: బెయిల్ ఆర్డర్ స్టేపై సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్
Also Read
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
కాగా.. తొలుత నిర్వహించిన నీట్ పరీక్షలో ఆరు కేంద్రాల్లో పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల సమయం కోల్పోయినందుకు ఈ విద్యార్థులకు గ్రేస్ మార్కులు కేటాయించారు. మేఘాలయ, హర్యానా, ఛత్తీస్ గఢ్, గుజరాత్ లలో ఒక్కో పరీక్షా కేంద్రం సకాలంలో పరీక్షను ప్రారంభించలేకపోగా, ఛండీగఢ్‌లో రెండు కేంద్రాలు షెడ్యూల్‌ను పాటించడంలో విఫలమయ్యాయి. బాధిత అభ్యర్థులకు జూన్ 23, ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య రీ ఎగ్జామినేషన్ నిర్వహించింది.
తాజావార్తలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!