Site icon NTV Telugu

IPL 2024: ఐపీఎల్ మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ విడుదల..

Ipl Schhedule

Ipl Schhedule

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ ఈ నెల 21న ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల కారణంగా తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. బీసీసీఐ (BCCI) ఐపీఎల్ 2024 మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.

Read Also: CM Jagan: ఎల్లుండి నుంచి ‘మేమంతా సిద్ధం’.. బస్సుయాత్ర చేపట్టనున్న సీఎం జగన్

ఏప్రిల్ 8 నుంచి మే 19 వరకు లీగ్ మ్యాచ్ లు జరుగనున్నాయి. మే 21న క్వాలిఫైయర్ 1, మే 22న ఎలిమినేటర్, మే 24న క్వాలిఫైయర్ 2, మే 26న ఫైనల్ మ్యాచ్ జరుగనున్నాయి. ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరుగనుంది. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుండగా.. రెండో క్వాలిఫయర్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. లీగ్ దశలో మూడు, నాల్గవ స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత క్వాలిఫయర్-1, 2 విజేతల మధ్య ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.

Read Also: Atchannaidu: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ.. ప్రభుత్వ సలహాదారుపై ఫిర్యాదు

Exit mobile version