Post Office Scheme: సీనియర్ సిజన్ల కోసం అద్భుత పథకం.. ఉద్యోగ విరమణ తర్వాత నెలకు రూ.20వేలు!
- ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి నెలా ఆదాయాన్ని సంపాదించడం అంత సులభం కాదు
- అయితే అలాంటి వారి కోసం పోస్టాఫిసు పథకం
- ప్రతి నెల రూ. 20 వేలు పొందే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి నెలా ఆదాయాన్ని సంపాదించడం ఉద్యోగస్తులకు అంత సులభం కాదు. అయితే ఉద్యోగ సమయంలో డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెట్టినట్లయితే.. ఈ పని కూడా సులభం అవుతుంది. మీరు పదవీ విరమణ తర్వాత కూడా నెలవారీ ఆదాయాన్ని పొండానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు మనం అటువంటి స్కీమ్ గురించి తెలుసుకుందాం.. ఇది ప్రభుత్వ పథకం. చిన్న పొదుపు పథకం కింద పనిచేస్తుంది. ఈ పథకం పదవీ విరమణ ప్రణాళిక కోసం ప్రముఖ పథకాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
READ MORE: Kalki 2898 AD 2: ‘కల్కి 2’ అప్‌డేట్.. షూటింగ్ ప్రారంభమయ్యేది అప్పుడే!
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
పోస్ట్ ఆఫీస్ పథకాల యొక్క గొప్ప పథకం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS). సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా ప్రతి నెలా ఐదేళ్లపాటు రూ.20 వేలు సంపాధించవచ్చు. ఈ ప్రభుత్వ పథకం కింద 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఎస్సీఎస్ఎస్ పథకం కింద.. 5 సంవత్సరాల మెచ్యూరిటీ ఉంది. ఇందులో నెలవారీ పెట్టుబడికి బదులు ఒక్కసారి మాత్రమే డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు.
READ MORE: IMD Warning: ఐంఎండీ కీలక హెచ్చరిక.. నేడు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు..
ఎవరు పెట్టుబడి పెట్టగలరు?
పోస్ట్ ఆఫీస్ యొక్క ఈ చిన్న పొదుపు పథకాల క్రింద.. సీనియర్ సిటిజన్లకు ప్రయోజనాలు అందించబడతాయి. 60 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం.. ఈ పథకం కింద 8.2 శాతం వడ్డీ వస్తుంది. 60 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో ఏకమొత్తంలో డబ్బును డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో గరిష్టంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు, ఇంతకు ముందు ఈ మొత్తం రూ. 15 లక్షలు ఉండేది ప్రస్తుతం దాన్ని రూ. 30 లక్షలకు చేర్చారు.
READ MORE: Gujarat Floods: గుజరాత్‌లో ప్రకృతి బీభత్సం.. 80 ఏళ్ల తర్వాత భూమి పైన ఉద్భవించిన నాల్గవ పెద్ద తుపాను!
నెలకు 20 వేలు పొందడం ఎలా?
మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కింద రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే.. మీకు ప్రతి సంవత్సరం సుమారు రూ. 2 లక్షల 46 వేల వడ్డీ లభిస్తుంది. ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తే ఈ మొత్తం రూ.20,500 అవుతుంది. ఈ పథకం కింద.. 55, 60 సంవత్సరాల మధ్య స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునే వ్యక్తులు కూడా ఖాతాను తెరవవచ్చు. సమీపంలోని ఏదైనా పోస్టాఫీసు శాఖను సందర్శించి అక్కడ ఖాతాను ఓపెన్ చేయండి. కాగా.. ఈ పథకం కింద ఆదాయం పొందుతున్న పౌరులు కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది . ఈ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రూ. 50 వేల కంటే ఎక్కువగా ఉంటే.. దానిపై టీడీఎస్ (TDS) చెల్లించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?