NTV Telugu Site icon

Post Office Scheme: సీనియర్ సిజన్ల కోసం అద్భుత పథకం.. ఉద్యోగ విరమణ తర్వాత నెలకు రూ.20వేలు!

Senior Citizen Saving Scheme

Senior Citizen Saving Scheme

ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి నెలా ఆదాయాన్ని సంపాదించడం ఉద్యోగస్తులకు అంత సులభం కాదు. అయితే ఉద్యోగ సమయంలో డబ్బును సరైన మార్గంలో పెట్టుబడి పెట్టినట్లయితే.. ఈ పని కూడా సులభం అవుతుంది. మీరు పదవీ విరమణ తర్వాత కూడా నెలవారీ ఆదాయాన్ని పొండానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు మనం అటువంటి స్కీమ్ గురించి తెలుసుకుందాం.. ఇది ప్రభుత్వ పథకం. చిన్న పొదుపు పథకం కింద పనిచేస్తుంది. ఈ పథకం పదవీ విరమణ ప్రణాళిక కోసం ప్రముఖ పథకాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

READ MORE: Kalki 2898 AD 2: ‘కల్కి 2’ అప్‌డేట్‌.. షూటింగ్‌ ప్రారంభమయ్యేది అప్పుడే!

పోస్ట్ ఆఫీస్ పథకాల యొక్క గొప్ప పథకం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS). సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా ప్రతి నెలా ఐదేళ్లపాటు రూ.20 వేలు సంపాధించవచ్చు. ఈ ప్రభుత్వ పథకం కింద 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఎస్సీఎస్ఎస్ పథకం కింద.. 5 సంవత్సరాల మెచ్యూరిటీ ఉంది. ఇందులో నెలవారీ పెట్టుబడికి బదులు ఒక్కసారి మాత్రమే డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు.

READ MORE: IMD Warning: ఐంఎండీ కీలక హెచ్చరిక.. నేడు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు..

ఎవరు పెట్టుబడి పెట్టగలరు?
పోస్ట్ ఆఫీస్ యొక్క ఈ చిన్న పొదుపు పథకాల క్రింద.. సీనియర్ సిటిజన్లకు ప్రయోజనాలు అందించబడతాయి. 60 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం.. ఈ పథకం కింద 8.2 శాతం వడ్డీ వస్తుంది. 60 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో ఏకమొత్తంలో డబ్బును డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో గరిష్టంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు, ఇంతకు ముందు ఈ మొత్తం రూ. 15 లక్షలు ఉండేది ప్రస్తుతం దాన్ని రూ. 30 లక్షలకు చేర్చారు.

READ MORE: Gujarat Floods: గుజరాత్‌లో ప్రకృతి బీభత్సం.. 80 ఏళ్ల తర్వాత భూమి పైన ఉద్భవించిన నాల్గవ పెద్ద తుపాను!

నెలకు 20 వేలు పొందడం ఎలా?
మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కింద రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే.. మీకు ప్రతి సంవత్సరం సుమారు రూ. 2 లక్షల 46 వేల వడ్డీ లభిస్తుంది. ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తే ఈ మొత్తం రూ.20,500 అవుతుంది. ఈ పథకం కింద.. 55, 60 సంవత్సరాల మధ్య స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునే వ్యక్తులు కూడా ఖాతాను తెరవవచ్చు. సమీపంలోని ఏదైనా పోస్టాఫీసు శాఖను సందర్శించి అక్కడ ఖాతాను ఓపెన్ చేయండి. కాగా.. ఈ పథకం కింద ఆదాయం పొందుతున్న పౌరులు కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది . ఈ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రూ. 50 వేల కంటే ఎక్కువగా ఉంటే.. దానిపై టీడీఎస్ (TDS) చెల్లించాల్సి ఉంటుంది.