Shiv Sena leader demands Ban Bigg Boss OTT 3: ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తోంది. అనిల్ కపూర్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షో రెండు వారాలు పూర్తి చేసుకుంది. టాస్కులు, వివాదాలు, రొమాంటిక్ సీన్స్.. కారణంగా ఓటీటీ సీజన్ 3 వార్తల్లో నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి.. రొమాంటిక్ సీన్స్ చూపిస్తున్నారని షోపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్ షోను ఆపండని ఫిర్యాదు అందింది. ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్‌లో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, బిగ్‌బాస్ షోను నిషేధించాలని శివసేన షిండే వర్గానికి చెందిన ప్రతినిధి మనీషా కయాండే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘జులై 18న ప్రసారమైన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్ జోడి బెడ్‌రూమ్‌లో శ్రుతిమించి ప్రవర్తించారు. ఇద్దరు హద్దులు మీరారు. పిల్లలు కూడా ఈ షో చూస్తారు. ఇలాంటి అభ్యంతరకర సీన్లు వారిపై ప్రభావం చూపిస్తాయి. బిగ్‌బాస్ షోను వెంటనే నిలిపివేయాలి. సైబర్ క్రైమ్ చట్టాల కింద కేసు నమోదు చేయాలి. బిగ్‌బాస్ ఫ్యామిలీ షో కాదు. ఈ షోను నిషేధించేలా చర్యలు తీసుకోవాలి’ అని నగర పోలీస్ కమిషనర్‌కు రాసిన లేఖలో మనీషా కయాండే పేర్కొన్నారు.
Also Read: Realme 13 Pro 5G Launch: రియల్‌మీ నుంచి రెండు సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు.. నయా ఫీచర్, బిగ్ బ్యాటరీ!
బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 3లో అర్మాన్ మాలిక్ హైలెట్ అయ్యాడు. తనకు ఇద్దరు భార్యలు ఉండడమే ఇందుకు కారణం. ఇటీవలి ఎపిసోడ్‌లలో అర్మాన్, అతని రెండవ భార్య కృతికకు సంబదించిన ఓ ప్రైవేట్ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. లైవ్ షోలో సన్నిహితంగా ఉండటంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోపై అర్మాన్ మొదటి భార్య పాయల్ స్పందిస్తూ.. అర్మాన్, కృతికల వీడియోను ఎవరో ఎడిట్ చేశారన్నారు. వీడియో క్లిప్‌లో కనిపించే లైట్స్, దుప్పటి షోలో ఉన్నవి కాదన్నారు. వీరిపైనే మనీషా కయాండే పోలీసులకు ఫిర్యాదు చేశారు.