Site icon NTV Telugu

Virat Kohli: విరాట్ కోహ్లీపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు..

Virat Kohli Crying

Virat Kohli Crying

చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనకు విరాట్ కోహ్లీ కూడా కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు అందింది. కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్‌ ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేయాలని కోరారు. ఇప్పటికే ఈ ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోషియేషన్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ పేరుతో వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

READ MORE: CM Yogi: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం యోగి.. ముస్లిం సోదరులకు కీలక సందేశం..!

కాగా.. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో అధికారులపై చర్యలు కొనసాగుతున్నాయి. కర్ణాటక ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్కర్‌ని బదిలీ చేశారు. హేమంత్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులపై బదిలీ వేటు పడింది. తొక్కిసలాట ఘటనలో అరెస్టు అయినా నలుగురిని రిమాండ్‌కు పంపారు. వారికి ప్రత్యేక సెషన్స్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్‌ నిఖిల్‌ సోసాలే.. డీఎన్‌ఏ సంస్థకు చెందిన ముగ్గురికి రిమాండ్‌ విధిస్తూ తీర్పు వెలువరించింది.

READ MORE: CM Yogi: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం యోగి.. ముస్లిం సోదరులకు కీలక సందేశం..!

Exit mobile version