NTV Telugu Site icon

Neeraj Chopra: చేతికి ఫ్రాక్చర్‌తో డైమండ్ లీగ్లో పాల్గొన్న నీరజ్ చోప్రా..

Neeraj Chopra

Neeraj Chopra

శనివారం బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. తాను ఈ మ్యాచ్‌లో ఆడేందుకు విరిగిన చేయితో వచ్చానని వెల్లడించాడు. Xలో పోస్ట్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలిపాడు. తన ఎడమ చేతిలో నాల్గవ మెటాకార్పల్ ఫ్రాక్చర్ అయినప్పటికీ పోటీలో పాల్గొన్నానని పేర్కొన్నాడు. ప్రాక్టీస్‌ సమయంలో గాయమైందని.. ఆ తర్వాత ఎక్స్ రే (X- RaY) చేయించుకున్నానని చెప్పాడు. అప్పుడు తన ఎడమ చేతి నాల్గవ మెటాకార్పల్ ఎముక విరిగిందని తేలిందన్నాడు. అయితే వైద్యుల సహకారంతో ఫైనల్ ఆడగలిగానని తెలిపాడు.

Read Also: Working Age Population: భారత్‌‌కి గుడ్ న్యూస్.. 2045 నాటికి మరో 17.9 కోట్ల మంది “పనిచేసే జనాభా”..

“ఈ సంవత్సరంలో ఇది చివరి పోటీ, నేను నా సీజన్‌ను ట్రాక్‌లో ముగించాలనుకున్నాను. నేను నా అంచనాలను అందుకోలేనప్పటికీ, చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాను. ఆడటానికి సిద్ధంగా ఉన్నాను. మీ ప్రోత్సాహానికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. 2024 నన్ను మంచి అథ్లెట్‌గా మరియు వ్యక్తిని చేసింది. 2025లో కలుద్దాం.” అని ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

బ్రస్సెల్స్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నీరజ్ 87.86 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. కాగా.. గ్రెనడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల త్రోతో మొదటి స్థానంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

Read Also: Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. దైవ దర్శనానికి వెళ్తూ ఆరుగురు మృతి