NTV Telugu Site icon

Chandrababu: నష్ట పరిహారం అందజేతపై సీఎం చంద్రబాబు సమీక్ష..

Ap Cm

Ap Cm

Chandrababu: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు పరిహారం అందజేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులతో ఎన్యుమరేషన్ ప్రక్రియ, పరిహారం చెల్లింపుపై రివ్యూ చేశారు. ఇప్పటికే ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో ఈనెల 25వ తేదీన బాధితులకు పరిహారం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విజయవాడలో వరదకు మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తు వారికి రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

Read Also: Cyber Fraud: అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షలు..! ట్విస్ట్ ఏంటంటే..?

కాగా, చనిపోయిన పశువులకు, నష్టపోయిన వ్యాపారులకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన పరిహారం అన్ని వర్గాల బాధితులకూ ఒకే సారి చెల్లించనుంది. ఇళ్లు మునిగిన వారితో పాటు వాహనాలు దెబ్బ తిన్న వారికి పంటలు దెబ్బ తిన్న రైతులకు నష్ట పరిహారం డబ్బులు బుధవారం అకౌంట్లలో నేరుగా ప్రభుత్వం జమ చేయనుంది. పరిహారం విషయంలో తమ పేరు నమోదు కాలేదు అనే ఫిర్యాదు ఎక్కడా రాకూడదని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 10 వేల వాహనాలకు గాను ఇప్పటి వరకు 6 వేల వాహనాలకు బీమా సెటిల్మెంట్ పూర్తి అయిందని అధికారులు చెప్పారు. మిగిలిన వాహనాలకు కూడా బీమా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.