Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Commonwealth Games 2026 Australias Victoria State As Withdrawn From Hosting The 2026 Commonwealth Games

Commonwealth Games 2026: కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నిర్వహించడం మావల్ల కాదు: ఆస్ట్రేలియా

Published Date :July 18, 2023 , 10:56 am
By Sampath Kumar
Commonwealth Games 2026: కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నిర్వహించడం మావల్ల కాదు: ఆస్ట్రేలియా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Australia state Victoria withdraws as host of 2026 Commonwealth Games: కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2026 ఆతిథ్యం నుంచి ఆస్ట్రేలియలోని విక్టోరియా స్టేట్‌ వైదొలిగింది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణకు అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్‌ అవుతుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్‌ తమ వల్ల కాదని మంగళవారం విక్టోరియా స్టేట్‌ తేల్చి చెప్పింది. గేమ్స్‌ నిర్వహణ నుంచి తాము తప్పుకుంటున్నట్లు కామన్‌వెల్త్‌ గేమ్స్‌ అథారిటీకి సమాచారం ఇచ్చామని, తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి వేరే వాళ్లకు ఇవ్వమని కోరినట్లు విక్టోరియా స్టేట్‌ ప్రతినిధులు తెలిపారు.

మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో విక్టోరియా స్టేట్‌ ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ మాట్లాడుతూ… ‘కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 20236 నిర్వహణకు ముందుగా మేము రెండు ఆస్ట్రేలియన్‌ బిలియన్‌ డాలర్స్‌ ($2Aus Billion Dollars) అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏడు ఆస్ట్రేలియ బిలియన్‌ డాలర్లు ($7Aus Billion Dollars) అయ్యేలా ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ బడ్జెట్ మాకు చాలా పెద్దది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నిర్వహించడం మావల్ల కాదు. లోటు బడ్జెట్‌తో ఉన్న మాకు గేమ్స్‌ నిర్వహణ భారంగా మారే అవకాశం ఉంది’ అని అన్నారు.

Also Read

  • Atlee : వాట్ ఎబౌట్ అట్లీ.. మళ్లీ సౌత్ హీరో వెంటపడతాడా..? బాలీవుడ్ హీరోని ఫిక్స్ చేశాడా...?
  • Sachin Tendulkar Birthday: గిరిజన పిల్లలతో కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేసిన 'క్రికెట్ గాడ్'.!
  • IRS Officer Daughter Murder: నిందితుడి తీరుపై కోర్టుకు పోలీసులు షాకింగ్ రిపోర్ట్.. ఏముందంటే..!
  • NBK111 : బాలయ్య - గోపించంద్ మలినేని - తమన్ ఈసారి సౌండ్ అదిరిపోద్ది!

Also Read: Maruti Wagon R Offer: రూ. 49 వేల డిస్కౌంట్.. 5 లక్షలకే మారుతి వ్యాగనార్‌! 34 కిమీ మైలేజ్‌

‘నేను ఈ ఉద్యోగంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా. అయితే ఇది వాటిలో ఒకటి కాదు. నిజం చెప్పాలంటే.. ఒక క్రీడా ఈవెంట్ కోసం $7 బిలియన్లు ఖర్చు చేయడం సమంజసం కాదు. గత సంవత్సరం అంచనా వేసిన బడ్జెట్‌తో పోల్చితే.. ఈ ఖర్చు మూడు రెట్లు ఎక్కువ. ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి అంత డబ్బు తేలేం. 2026లో విక్టోరియాలో గేమ్స్ జరగవు. కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలనే మా నిర్ణయాన్ని కామన్వెల్త్ గేమ్స్ అధికారులకు ఇప్పటికే చెప్పాము’ అని డేనియల్ ఆండ్రూస్ తెలిపారు.

ఒలింపిక్స్‌ తర్వాత అత్యంత ప్రాధాన్యమున్న టోర్నీ కామన్‌వెల్త్‌ గేమ్స్‌ అన్న విషయం తెలిసిందే. నాలుగేళ్లకోసారి నిర్వహించే కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్‌ ఆతిథ్యం ఇవ్వాలి. బడ్జెట్ కారణంగా నిర్వహణపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది. ఇక 2022లో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హమ్‌ ఆతిథ్యమిచ్చింది. ఈ గేమ్స్‌లో 179 పతకాలతో ఆస్ట్రేలియా టాప్‌లో ఉండగా.. 176 పతకాలతో ఇంగ్లండ్‌ రెండో స్థానంలో నిలిచింది. 61 పతకాలతో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది.

Also Read: Protein Foods: వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే.. జిమ్‌కి వెళ్లకుండానే మీ నడుము సన్నబడుతుంది!

Bit of a long one this morning.

You might have heard the news this morning that Victoria will no longer be hosting the 2026 Commonwealth Games.

And I wanted to tell you about the decision.

— Dan Andrews (@DanielAndrewsMP) July 17, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Australia
  • commonwealth games
  • Commonwealth Games 2026
  • Daniel Andrews
  • victoria

తాజావార్తలు

  • Atlee : వాట్ ఎబౌట్ అట్లీ.. మళ్లీ సౌత్ హీరో వెంటపడతాడా..? బాలీవుడ్ హీరోని ఫిక్స్ చేశాడా…?

  • Hardik Pandya: “మా పతనానికి కారణం ఇదే”.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్

  • Sachin Tendulkar Birthday: గిరిజన పిల్లలతో కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేసిన ‘క్రికెట్ గాడ్’.!

  • IRS Officer Daughter Murder: నిందితుడి తీరుపై కోర్టుకు పోలీసులు షాకింగ్ రిపోర్ట్.. ఏముందంటే..!

  • NBK111 : బాలయ్య – గోపించంద్ మలినేని – తమన్ ఈసారి సౌండ్ అదిరిపోద్ది!

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions