Site icon NTV Telugu

Andhrapradesh: ఉత్తరాంధ్రలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు

Cm Camp Office

Cm Camp Office

Andhrapradesh: ఉత్తరాంధ్రలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతి ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికోసం ముగ్గురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్, సాధారణం పాలన కార్యదర్శితో కమిటీని ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబాటుతనం, వామపక్ష తీవ్రవాద రిస్క్ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read: TS Election: తెలంగాణ పాలనా వ్యవస్థపై ఈసీ కొరడా.. ఐఏఎస్, ఐపీఎస్‌లపై బదిలీ వేటు

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో విస్తృతం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం సంబంధిత శాఖల ఉన్నతాధికారులు తరచూ క్షేత్ర స్థాయి పర్యటనలు, సమీక్షలు చేయాల్సి ఉంటుందనీ జీవోలో స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి సైతం తరచూ పర్యటనలు, సమీక్షలు, నైట్ హాల్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలో అవసరమైన అధికారులు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మంత్రులు, అధికారుల ట్రాన్సిట్ అకామడేషన్ గుర్తింపు కోసం కమిటీ కసరత్తు చేయనుంది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Exit mobile version