దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్ మే 7న జరగనుంది. అయితే ఎన్నికల సందర్భంగా మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోడీపై పోటీ చేసేందుకు హాస్యనటుడు రెడీ అయ్యాడు.వారణాసిలో ప్రధాని మోడీపై పోటీ చేస్తున్నట్లు కమెడీయన్ శ్యామ్ రంగీలా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ట్విట్టర్‌లో వీడియో రిలీజ్ చేశారు. అలాగే వారణాసికి వస్తున్నట్లు ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: Anil Ravipudi-IPL: ఐపీఎల్ మ్యాచ్‌లపై కామెంట్స్.. డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఆడుకుంటున్న ఫాన్స్!
ప్రధాని మోడీ ఇప్పటికే వారణాసి నుంచి రెండు సార్లు విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు బరిలోకి దిగారు. అయితే ప్రధాని మోడీని అనుకరిస్తూ శ్యామ్ రంగీలా పేరు సంపాదించారు. అయితే బుధవారం వారణాసి నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగతా విషయాలను త్వరలో వీడియో ద్వారా తెలియజేస్తానని చెప్పారు.
ఇది కూడా చదవండి: Varanasi: హాస్యనటుడు శ్యామ్ రంగీలా కీలక ప్రకటన.. మోడీపై పోటీ చేస్తున్నట్లు వెల్లడి
2014లో ప్రధాని మోడీకి మద్దతుగా ప్రచారం చేసినట్లు తెలిపారు. అనేక వీడియోలు కూడా చేసినట్లు చెప్పారు. రాహుల్, కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వీడియోలు చేసినట్లు చెప్పుకొచ్చారు. గత పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితి వేరుగా ఉందన్నారు. 10 ఏళ్లలో పరిస్థితులు మారిపోయాయి. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోడీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్ మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఇక వారణాసి పోలింగ్ చివరి విడతలో జరగనుంది. అంటే జూన్ 1న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
वाराणसी मैं आ रहा हूँ…#ShyamRangeelaForVaranasi pic.twitter.com/8BOFx4nnjn
— Shyam Rangeela (@ShyamRangeela) May 1, 2024