NTV Telugu Site icon

Purandeswari: ఎలన్‌ మస్క్‌కు ఎక్స్‌ వేదికగా పురంధేశ్వరి ఆహ్వానం

Purandeswari

Purandeswari

Purandeswari: టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చని ఆయన చేసిన వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. ఈవీఎంల విషయంలో టెస్లా చీఫ్ ఎలన్ మస్క్, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని మస్క్ కామెంట్ చేయగా, ఇండియాలో తయారైన ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదని రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఎలాన్​ మస్క్ స్పందిస్తూ.. ‘‘మనం ఈవీఎంలను తొలగించాలి. వాటిని వ్యక్తుల సాయంతో లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది”అని ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.

Read Also: NCERT Chief: ‘భారత్’, ‘ఇండియా’లను పాఠ్యపుస్తకాల్లో పరస్పరం మార్చుకోవాలి..

దీంతో ఎలన్ మస్క్‌కు X వేదికగా పురంధేశ్వరి ఇన్విటేషన్ ఇచ్చారు. ఈవీఎంలను హ్యాక్ చేయగలరు అంటున్న ఎలన్ మస్క్‌ను ఇండియాకు పిలవాలని నిర్ణయించారు. ఎలన్ మస్క్‌ని మన ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించమని ఎన్నికల సంఘాన్ని అడగాలన్నారు. ఎంతమంది ప్రయత్నించినా మన ఈవీఎంలను హ్యాక్ చేయలేరు అంటూ పురంధేశ్వరి ట్వీట్ చేశారు. ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్‌ ఇప్పుడు భారత్‌లో ప్రకంపనలు రేపుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మస్క్ ఈ ట్వీట్ చేసినా, ఇప్పుడు భారత్‌లో కూడా ఈవీఎంల పనితీరుపై చర్చ జరుగుతోంది.