NTV Telugu Site icon

Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లిలో అతిథుల చేతికి రంగు రంగుల బ్యాండ్లు..ఎందుకో తెలుసా..?

Wear Colour Coded Bands

Wear Colour Coded Bands

ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జూలై 14న జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌తో అనంత్, రాధికల వివాహ వేడుకలు ముగిశాయి. దీనికి ముందు.. అనంత్-రాధికల ఆశీర్వాద కార్యక్రమం జూలై 13న జరిగింది. అంబానీ కుటుంబీకుల ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనంత్, రాధికల వివాహానికి మన దేశం నుంచే కాక విదేశాల నుంచి సైతం సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరల్డ్ జియో సెంటర్‌లో బాలీవుడ్ ప్రముఖుల ఫెయిర్ కూడా నిర్వహించారు. అయితే పెళ్లిలో సెలబ్రిటీల ఎంట్రీ మాత్రం ప్రత్యేకంగా జరిగింది. చిత్రాలు మరియు వీడియోలలో ప్రముఖుల చేతుల్లో రంగురంగుల బ్యాండ్‌లను చూసే ఉంటారు. అయితే వాటి అర్థం మీకు తెలుసా?.. ఈ బ్యాండ్లపై రచయిత దుర్జోయ్ దత్తా భార్య అవంతిక వివరించింది. బ్యాండ్‌లు అనంత్ పెళ్లిలో సీటింగ్ ఏర్పాటును సూచిస్తాయని వెల్లడించింది.

READ MORE: Suicide: భార్యను ‘టీ’ చేయమని చెప్పిన భర్త.. ఆమె నిరాకరించడంతో ఆత్మహత్య

కాగా.. సెలెబ్స్ మాత్రమే కాకుండా విజిటింగ్ గెస్ట్‌లందరి చేతి మణికట్టు మీద రంగురంగుల బ్యాండ్‌లు ఉన్నాయి. అతిథుల సౌకర్యార్థం మాత్రమే వీటిని అందించారు. నిజానికి.. అతిథి ప్రవేశం బ్యాండ్ ప్రకారం నిర్ణయించబడింది. బ్యాండ్ రంగు ప్రకారం అతిథులు సిట్టింగ్ జోన్‌లోకి ప్రవేశించారు. పింక్ బ్యాండ్‌లు ధరించిన అతిథులు ప్రత్యేక సిట్టింగ్ జోన్‌ను కలిగి ఉండగా.. ఆరెంజ్ బ్యాండ్‌లు ధరించిన అతిథులు వేరే జోన్‌లో ప్రవేశించారు. ఈ బ్యాండ్ల సాయంతో అతిథులకే కాకుండా సెక్యూరిటీ సిబ్బందికి కూడా పనిలో ఎంతో సౌలభ్యం లభించింది. సీటింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అతిథులకు వివిధ రంగుల రిస్ట్‌బ్యాండ్‌లను అందజేస్తున్నట్లు సమాచారం. అనంత్ మరియు రాధికల వివాహానికి హాజరైన అతిథులందరూ, ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులతో సహా వారి చేతికి వివిధ రంగుల బ్యాండ్‌లు కట్టారు. ఇది కాకుండా.. అనంత్-రాధికల వివాహానికి వచ్చే అతిథులకు క్యూఆర్ కోడ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. సమాచారం ప్రకారం.. అతిథులకు ఆహ్వాన కార్డులు ఇవ్వడంతో పాటు, అంబానీ కుటుంబం క్యూఆర్ కోడ్‌లను కూడా అందించింది. కోడ్‌ని చూపుతూ అతిథులు పెళ్లిలోకి ప్రవేశించారు. దీని తరువాత..బ్యాండ్ ప్రకారం.. వారిని వారి సిట్టింగ్ జోన్‌లో కూర్చోబెట్టారు. దీని వల్ల అతిథులకు గానీ, ఉద్యోగులకు గానీ ఎలాంటి అసౌకర్యం కలగలేదు.