NTV Telugu Site icon

Physical Harassment: కదులుతున్న కారులో కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Physical Harassment

Physical Harassment

Physical Harassment: రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. త్రిపురకు చెందిన ఒక కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. పశ్చిమ త్రిపుర జిల్లాలో కదులుతున్న కారులో కళాశాల విద్యార్థినిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం విషమ స్థితిలో ఉన్న ఆమెను పశ్చిమ త్రిపురలోని అమాతలి బైపాస్ వద్ద వదలిపెట్టి పరారయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన జరిగింది. ఈఘటనలో ప్రధాన నిందితుడైన గౌతమ్ శర్మ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు బుధవారం అతడిని ప్రశ్నించడం ప్రారంభించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు గౌతం శర్మ (26), నేరం చేసిన వాహనం డ్రైవర్ సుదీప్ చెత్రి (31) సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే అరెస్టు చేశారు. కాగా, మూడో నిందితుడు మహేశ్‌ కాలా ప్రాంతానికి చెందిన ప్తాడెన్‌జిత్‌ పాల్‌ (26)ను గురువారం అరెస్టు చేశారు.

సోమవారం రోజంతా ఆ బాలిక ప్రధాన నిందితుడితో కలసి వాహనంలోనే తిరుగుతూ కనిపించిందని, అయితే సోమవారం రాత్రి ఏకాంతంగా ఉండడం చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ప్రధాన నిందితుడు ఆమెను అమాతలి బైపాస్ సమీపంలో వదిలి పరారయ్యాడని సబ్‌డివిజనల్ పోలీసు అధికారి ఆశిష్ దాస్‌గుప్తా బుధవారం మీడియాకు తెలిపారు. ఆ బాలిక తరచు ప్రధాన నిందితుడితో మాట్లాడుతూ ఉండేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఆమెపై అత్యాచారానికి పాల్పడింది ఒకరా లేక మరికొందరా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాగా, జీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత త్రిపురలో విద్యార్థులు, మహిళా సంఘాలతో సహా వివిధ సంస్థలు గురువారం నిరసన ప్రదర్శనలు నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ త్రిపుర శివార్లలోని తన కళాశాల నుండి తిరిగి వస్తుండగా 20 ఏళ్ల విద్యార్థిని సోమవారం మధ్యాహ్నం అపహరణకు గురైంది.

Read Also: Tihar Jail: 90 మంది తీహార్ జైలు అధికారులు ట్రాన్స్‌ఫర్.. గ్యాంగ్‌స్టర్ హత్య తరువాత కీలక పరిణామం

బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కాలేజ్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న ఆమె కుమార్తెకు ఒక యువకుడు కారులో లిఫ్టు ఇవ్వచూపాడు. అందుకు అంగీకరించిన ఆమె కుమార్తె కారులో ఎక్కగా అందులోనే ఉన్న ముగ్గురు యువకులు ఆమెపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను అమాతలి బైపాస్ వద్ద వదిలి పారిపోయారు. బంధువులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలిసిన వెంటనే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపయ్య దత్తా, బీజేపీ మహిళా మోర్చా నాయకులు ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి ఆరోగ్యం గురించి విచారించారు. ముఖ్యమంత్రి మాణిక్ సహా ఆదేశా ల మేరకే తాము బాధితురాలి వద్దకు వెళ్లినట్లు దత్తా తెలిపారు. ఈ సంఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా బీజేపీ ఉంటుందని ఆయన చెప్పారు.