College Student: ప్రేమికుడి మోసం.. ఫ్లైఓవర్‌పై నుండి దూకి యువతి ఆత్మహత్యాయత్నం!

  • ప్రేమికుడి మోసం
  • మనస్తాపానికి గురైన యువతి
  • ఫ్లైఓవర్‌పై నుండి దూకి ఆత్మహత్యాయత్నం
Sucide

Sucide

Young woman attempted suicide in Ghatkesar: ప్రేమించిన వాడి మోసంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. వరంగల్ హైవేలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌పై నుండి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…

Also Read: NKR21: ‘రాముల‌మ్మ’ ఈజ్ బ్యాక్.. విజయశాంతి ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్‌ రిలీజ్! గూస్‌బంప్స్ పక్కా

నాగమణి (18) అనే యువతి ఔషాపూర్‌లోని విజ్ఞాన్ భారతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. విద్యార్థిని నాగమణి స్వస్థలం జనగాం కాగా.. ఇక్కడే హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోయానని.. వరంగల్ హైవేలో ఉన్న బ్రిడ్జిపై నుండి దూకి నాగమణి ఆత్మహత్యాయత్నం చేసింది. నాగమణికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.