NTV Telugu Site icon

Collectors Conference: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ తాజా తేదీలు ఇవే.. దిశానిర్దేశం చేయనున్న సీఎం, డిప్యూటీ సీఎం

Collectors Conference

Collectors Conference

Collectors Conference: ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చసి ఆరు నెలలు పూర్తవుతోంది. అయితే, ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చామని.. ఇక, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలకు సిద్ధం అవుతోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. మరోవైపు.. తమ టార్గెట్‌ వైపు వడివడిగా అడుగులు వేస్తోన్న కూటమి ప్రభుత్వం.. మరిన్ని భవిష్యత్ లక్ష్యాలను ఫిక్స్ చేసుకునేందుకు సిద్ధం అవుతోంది.. అందులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించిన విషయం విదితమే కాగా.. మరోసారి.. అంటే ఈ నెల 10, 11 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. కానీ, తాజాగా తేదీలను మార్చేసింది.. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్టు ప్రకటించింది..

Read Also: Jaggareddy: సోనియా గాంధీ బర్త్‌డే వేడుకలు.. పోతురాజులతో జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్

మొదటి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. వివిధ శాఖల వారీగా కాన్ఫరెన్స్‌లో ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు.. ఇక, రెండో రోజు ముగింపు సమయంలోనూ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆరు నెలల పాలన పూర్తవుతున్న వేళ.. కొత్త లక్ష్యాలను ఫిక్స్ చేస్తూ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.. ఈ సారి సదస్సులో గతం కంటే భిన్నంగా సీఎం చంద్రబాబు కీలక ఆవిష్కరణలను సిద్ధం అవుతున్నారట.. ఈ సారి రాష్ట్ర స్థాయి నుంచే కాకుండా జిల్లా, నియోజకవర్గ స్థాయి విజన్ డాక్యుమెంట్లను ప్రకటించేందుకు రెడీ అవుతున్నారట.. వీటి అమలుపైనా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న శాఖల్లో ఈ 6 నెలల కాలంలో వచ్చిన మార్పు.. తీసుకురావాల్సిన మార్పుల పైన చర్చించి కీలక సూచనలు చేయనున్నారు. వ్యవసాయం, నీటి పారుదల అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టబోతున్నారట.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం కాగా.. భూముల పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో భూ రికార్డుల పరిశీలన.. ఫిర్యాదుల పరిష్కారంపై కీలక సూచనలు చేసే అవకాశం ఉందంటున్నారు..

Show comments