సాధారణంగా పలు ఈవెంట్స్‌లో కొన్ని జంటలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. క్రికెట్ ను వీక్షించేందుకు వచ్చిన వ్యక్తి తన ప్రియురాలికి ప్రపోజ్ చేయడం వంచి ఘటనలు చూసే ఉంటాం. అమెరికాలోని మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లో గిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్‌ప్లే కన్సర్ట్ లో ఇలాంటి ఘటనే జరిగింది. కానీ.. ఓ జంట హగ్ చేసుకుంటున్న సమయంలో ఈ స్పాట్ లైట్ ఫోకస్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బిగ్ స్క్రీన్‌పై కనిపించిన వ్యక్తి ఓ కంపెనీకి చెందిన సీఈవో అని తేలింది. ఆ మహిళ అదే కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్ గా పని చేస్తుస్తోంది. ఈ వీడియో చూసిన కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది.
READ MORE: Tejashwi Yadav: మోడీ-నితీష్ పాలనలో బీహార్ తాలిబాన్‌లా మారింది..
వాస్తవానికి.. అమెరికాలోని ప్రముఖ డేటా ఆర్కెస్ట్రేషన్ సంస్థ ఆస్ట్రానమర్ సీఈఓ ఆండీ బైరన్. జులై 16వ తేదీన బోస్టన్‌లోని జిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్‌ప్లే కన్సర్ట్‌కు తన కంపెనీ చీఫ్ హెచ్ఆర్ మేనేజర్ క్రిస్టిన్ కాబోట్‌తో కలిసి వెళ్లాడు. ఆమెను హత్తుకోవడం.. ఇద్దరూ నిలబడి సన్నిహితంగా ఉన్న దృశ్యాలు అక్కడి కెమెరాలో కనిపించాయి. ఇలా అక్కడి వారందరి దృష్టి ఈ జంటపైకి మళ్లింది. కెమెరా తమపైనే ఉందని గుర్తించిన ఆండీ బైరన్, క్రిస్టిన్ కాబోట్ వెంటనే కెమెరాకు దూరంగా జరగడానికి ప్రయత్నించారు. ఈక్రమంలోనే ఈ దృశ్యాలను చూసిన కోల్డ్‌ప్లే ప్రధాన గాయకుడు క్రిస్ మార్టిన్.. “ఓహ్, వీరిద్దరినీ చూడండి… వారికి రైలా ఉన్నారో, మనల్ని చూసి ఎంతలా సిగ్గుపడుతున్నారో” అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోల్డ్‌ప్లే గేట్’ పేరుతో టిక్‌టాక్, ఎక్స్ (ట్విట్టర్), రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫాంలలో మిలియన్లలో పైగా వీక్షణలను పొందింది.
READ MORE: MP Gurumurthy: రాష్ట్రపతి, ప్రధానికి వైసీపీ ఎంపీ లేఖ.. కీలక విషయాలు ప్రస్తావించిన గురుమూర్తి..
కాగా.. ఆండీ బైరన్ వివాహితుడు కాగా.. ఆయనకు మెగాన్ కెర్రిగాన్ బైరన్ అనే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. క్రిస్టిన్ కాబోట్ కూడా గతంలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కోల్డ్ ప్లే కాన్సర్ట్‌లో తమ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు ఆలింగనం చేసుకుంటున్నట్లు కనిపిస్తోన్న క్లిప్ వైరల్ అయిల్ అయిన తర్వాత సీఈవోను సస్పెండ్ చేసినట్లు అమెరికా టెక్ కంపెనీ ఆస్ట్రానమర్ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కంపెనీ పోస్ట్ చేసింది. ”ఆస్ట్రానమర్ సంస్థ తమ విలువలకు, సంస్కృతికి కట్టుబడి ఉంది. మా లీడర్ల నుంచి ప్రవర్తన, జవాబుదారీతనం పరంగా ఉన్నత ప్రమాణాలను మేం ఆశిస్తాం. ఈ ఘటనపై ఒక అధికారిక దర్యాప్తును డైరెక్టర్ల బోర్డు ప్రారంభించింది. త్వరలోనే దీనికి సంబంధించిన అదనపు వివరాలను మీతో పంచుకుంటాం” అని ఆస్ట్రానమర్ కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.