NTV Telugu Site icon

Cold Waves: ఏజెన్సీల్లో చలితీవ్రత.. పాడేరుని వణికిస్తున్న పొగమంచు

Cold Wave

Cold Wave

ఏపీలో చలితీవ్రత బాగా పెరిగింది. ముఖ్యంగా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత బాగా ఎక్కువగా ఉంది. పొగ మంచు దట్టంగా కురుస్తుండడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. పాడేరులో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మినుములూరులో అత్యల్పంగా 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2022 ఏడాది ముగుస్తుండడంతో కొత్త సంవత్సరం ఆదివారం కావడంతో పర్యాటకుల తాకిడి అరకు, సమీప ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లాడ్జ్,హోటళ్ళు రిసార్ట్ లు శనివారం నుండే ముందస్తుగా నిండుకున్నాయి. ధరలు పెంచేసి దోపిడీకి పాల్పడుతున్నాయి హోటళ్ళు.

Read Also: Hospital Negligence: ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. సైనస్ చికిత్సతో బాలిక మృతి

పర్యాటక ప్రాంతాల్లో ఇప్పటికే పర్యాటకులను ఆకర్షించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టింది టూరిజం శాఖ. రేపటి నుండి 1,2తేదీల్లో లంబసింగిలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఇటు ఏపీ, తెలంగాణల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగినా రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. గత వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులున్నా చలి తీవ్రత తగ్గడం లేదు. రోడ్లపై పొగమంచు ఇబ్బంది పెడుతోంది. రోడ్లు సరిగా కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌లో జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉదయం దట్టమైన పొగమంచు కప్పేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. చలి గాలుల కారణంగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.