Cock in Lockup: రెండు రోజులుగా లాకప్‌లో కోడిపుంజు.. ఏం నేరం చేసిందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cock Bird Found in Jadcherla Police Station Lockup: సాధారణంగా పోలీస్ స్టేషన్‌లోని లాకప్‌లో నేరస్థులు ఉంటారు. నేరాలు, ఘోరాలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్‌లో వేస్తారు. ఇందుకు బిన్నంగా లాకప్‌లో ఓ కోడిపుంజు ఉంది. ఈ ఆసక్తికర ఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్లో సోమవారం చోటు చేసుకుంది. రెండు రోజులుగా లాకప్‌లో ఉన్న కోడిపుంజు కూస్తూనే ఉందట. ఇందుకు సంబందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని బురెడ్డిపల్లిలో ఇటీవల తరచుగా కోళ్లు చోరీకి గురవుతున్నాయి. దీంతో గ్రామస్థులంతా కోళ్ల దొంగను పట్టుకునేందుకు నిఘా వేశారు. శనివారం రాత్రి కర్వెన ప్రాంతానికి చెందిన ఓ బాలుడు బురెడ్డిపల్లిలో ఓ కోడిపుంజును ఎత్తుకెళుతుండగా గ్రామస్థులు చూశారు. ఆ బాలుడు పారిపోతుండగా పట్టుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి బాలుడితో పాటు కోడిపుంజును స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Also Read
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్‌గా నియామకం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
Also Read: America Richest Women List 2023: ఫోర్బ్స్ అమెరికా మహిళా సంపన్నుల జాబితా.. నలుగురు భారతీయులకు చోటు!
బాలుడు మైనర్ కావటంతో తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు పోలీసులు. ఇక కోడిపుంజు ఎవరిదో తెలియలేదు. కోడిపుంజు తమదే అని బురెడ్డిపల్లి నుంచి ఫిర్యాదు రాలేదు. దాంతో కోడిపుంజు బయట ఉంటే కుక్కలు దాడిచేస్తాయని భావించిన సీఐ రమేశ్ బాబు లాకప్‌లో పెట్టారు. అంతేకాదు దానికి గింజలు, నీరు ఏర్పాటు చేయించారు. ఠాణాకు వెళ్లిన వారంతా లాకప్‌లో ఉన్న కోడిపుంజును చూసి షాక్ అయ్యారు. పోలీసులు విషయం చెప్పడంతో సరదాగా నవ్వుకుంటున్నారు. కోడిపుంజుకు గింజలు వేస్తూ పోలీసులు కాపలా కాయటం బాగుందని అందరూ అనుకంటున్నారు.
Also Read: 2023 July Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. జులైలో ఒక శనివారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి!
తాజావార్తలు
-
Hamas: హమాస్‌కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్‌గా నియామకం..
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
-
JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!