NTV Telugu Site icon

Jagananna Videshi Vidya Deevena: విద్యార్థులకు సీఎం జగన్‌ శుభవార్త.. రేపే వారికి ఆర్థిక సాయం

Cm Ys Jagan

Cm Ys Jagan

Jagananna Videshi Vidya Deevena: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విద్యార్థులకు మరోసారి శుభవార్త చెప్పారు.. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే కాగా.. తద్వారా అర్హులైన విద్యార్థులు విదేశాల నుండి ఉన్నత విద్యను అభ్యసించడానికి, వృత్తిపరమైన, గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేయడానికి వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఇక, రేపు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. అర్హులైన 357 మంది విద్యార్థుల విదేశీ విద్యకు ప్రభుత్వ ఆర్థిక సహాయం చేయనుంది.. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా బటన్‌ నొక్కి 45.53 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు సీఎం జగన్.. రేపు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జగనన్న విదేశీ విద్యకు సంబంధించిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు… ఇక, ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ. 1.25 కోట్ల వరకు ఫీజు రీయింబెర్స్‌మెంట్‌ చేయనుండగా.. ఇతర విద్యార్థులకు కోటి రూపాయల వరకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయనుంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.

కాగా, రాష్ట్ర విద్యార్థులను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది చదువుల్లో నాణ్యత పెంపొందించి ప్రపంచంతో పోటీ పడేలా వైఎస్‌ జగన్మోహన్‌ఱెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు వైసీపీ సర్కార్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించింది. పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ కోర్సులకు సంబంధించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో మేలు చేకూరుస్తోంది.. ఈ పథకం కింద ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీలలో సీటు పొంది , PG , PHD లేదా MBBS చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోంది ప్రభుత్వం.. వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలు. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేస్తున్నారు.