CM YS Jagan Ongole Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించనున్నారు.. ఒంగోలు నగరంలో 25 వేల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు సీఎం జగన్.. ఇక, ఒంగోలు పర్యటన కోసం.. రేపు ఉదయం 9.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న ఆయన.. ఉదయం 10.20 గంటలకు ఒంగోలులోని అగ్రహారం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.30 ఒంగోలు తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. 11.25 నుంచి 12.25 వరకు సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తిరిగి మధ్యాహ్నం 12.45 గంటలకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు..
Read Also: Hyderabad: గొర్రెల పంపిణీ అవకతవకల్లో నలుగురు అరెస్ట్..
ఒంగోలు ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తారు. గత కొద్ది కాలంగా పెండింగ్ పడుతూ వస్తున్న ఒంగోలు పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని స్ధానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేశారు. ప్రభుత్వం తొలివిడత 70 కోట్ల నగదును విడుదల చేసింది.. అయితే, ఆ తర్వాత రెండవ విడత నగదు విడుదలలో జాప్యం జరగటంతో ఒంగోలులో వైసీపీ పట్టాలు ఇవ్వలేదని పెద్దఎత్తున టీడీపీ విమర్శలకు దిగింది.. దీంతో సీరియస్ గా తీసుకున్న బాలినేని.. పలుమార్లు సీఎం జగన్ ను కలసి పరిస్థితి తీవ్రతను వివరించారు.. 25 వేల మందికి పట్టాలు పంపిణీ చేయలేక పోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని కూడా ప్రకటించారు.. దీంతో సీఎం జగన్ పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ప్రభుత్వం ఒంగోలులో పేదలకు పట్టాలు పంపిణీ చే సేందుకు అవసరమైన భూ సేకరణకు, లే అవుట్‌లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం 231 కోట్లు మంజూరు చేసింది.
Read Also: Geethanjali Malli Vachindhi: స్మశాన వాటికలో టీజర్ లాంచ్..BVS రవికి కొత్త డౌట్?
గతంలో చెప్పినట్టుగానే ఇప్పటికే పేదలకు పంపిణీ చేసేందుకు పట్టాలను కూడా సిద్దం చేశారు. రేపు సీఎం జగన్ చేతులు మీదుగా ఒంగోలులో అర్హులైన ప్రజలందరికి ఇళ్ల పట్టాలు అందించనున్నారు. మరోవైపు ఒంగోలు ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు 350 కోట్ల రూపాయల ప్రాజెక్టును కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో నగర ప్రజల దాహార్తి కూడా తీరనుంది.. ప్రాజెక్టు పూర్తయితే ఒంగోలు ప్రజలకు ప్రతీరోజు తాగునీరు అందించే అవకాశం ఉంది.. సీఎం జగన్ పర్యటనకు సంబంధించి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.. భారీ ఎత్తున ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. పోలీసులు సీఎం పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.