NTV Telugu Site icon

CM YS Jagan: పవన్‌ కల్యాణ్‌ పెళ్లిళ్లపై సీఎం ఘాటు వ్యాఖ్యలు.. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్..!

Jagan Pk

Jagan Pk

CM YS Jagan: పవన్‌ కల్యాణ్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. సామర్లకోటలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌, బాలకృష్ణపై విరుచుకుపడ్డారు.. ఇక, పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేసిన ఆయన.. మన కాపులు, ప్రజలకి దత్త పుత్రుడు వంటి వ్యక్తి మీద ఎలా ప్రేమ ఉంటుంది? అని ప్రశ్నించారు. చంద్రబాబు దత్త పుత్రుడి ఇల్లు హైదరాబాద్ లో ఉంటుంది.. దత్తపుత్రుడి ఇంట్లో ఇల్లాలు.. మూడు నాలుగు ఏళ్లకి మారిపోతుంది.. ఒక సారి లోకల్, మరొక సారి నేషనల్, ఇంకొకసారి ఇంటర్నేషనల్.. ఆడవాళ్ల పట్ల దత్త పుత్రుడుకి ఉన్న గౌరవం అది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Also: Salman: వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌‌లో అసోసియేషన్‌తో చరిత్ర సృష్టించనున్న ‘టైగర్ 3’

ప్యాకేజీ స్టార్ కి పోటీ చేసి ఓడిపోయిన భీమవరంతో సంబంధం లేదు.. గాజువాకతో అనుబంధం లేదు.. అభిమానుల ఓట్లు హోల్ సేల్ గా అమ్ముకోవడానికి దత్త పుత్రుడు అప్పుడప్పుడు వస్తాడు అని దుయ్యబట్టారు సీఎం జగన్‌.. రెండు షూటింగ్ ల మధ్య గ్యాప్ లో వ్యాపారానికి దత్తపుత్రుడు వస్తాడని మండిపడ్డ ఆయన.. సొంత వర్గాన్ని, పార్టీని అమ్ముకుంటున్నాడు అని దుయ్యబట్టారు.. మరోవైపు.. చంద్రబాబు ముఖం చేస్తే స్కామ్ లు.. జగన్ ముఖం చేస్తే స్కీమ్ లు గుర్తుకు వస్తాయన్నారు సీఎం జగన్‌.. చంద్రబాబు ముఖం చేస్తే లంచాలు, వెన్నుపోట్లు గుర్తుకు వస్తాయి.. గజ దొంగల ముఠా.. ఈ తేడా గుర్తించండి అని విజ్ఞప్తి చేశారు. పొత్తులు, గజ దొంగల ముఠా, దత్తపుత్రుడిని మీ బిడ్డ నమ్ముకోలేదు.. మీకు మంచి జరిగితే మీరే అండగా నిలబడండి అని కోరారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Show comments