NTV Telugu Site icon

YSRCP: పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై సీఎం సీరియస్‌.. ఇది తగునా..!

Pilli Subhash

Pilli Subhash

YSRCP: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పంచాయతీ తాడేపల్లికి చేరింది. మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య తీవ్రమైన విభేధాలు నెలకొన్న విషయం విదితమే.. ఇరు వర్గాలు పరస్పర తీవ్ర ఆరోపణలకు దిగాయి.. అంతేకాదు.. దాడులు కూడా చేసుకునే వరకు వెళ్లింది పరిస్థితి.. ఇక, విబేధాల పరిష్కారం కోసం రంగంలోకి దిగిన సీఎం వైఎస్ జగన్.. ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను పిలిపించారు.. దీంతో.. ఈ రోజు ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఎంపీ పిల్లి సుభాష్..

Read Also: Priya Prakash Varrier: స్లీవ్ లెస్ టాప్ ధరించి కాక రేపుతున్న ప్రియా ప్రకాష్ వారియర్

అయితే, ఈ భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.. రామచంద్రాపురం పంచాయితీపై సీఎం జగన్‌ సీరియస్ అయ్యారు.. ఎంపీ పిల్లి బోస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీఎంతో జరిగిన సమవేశంలో మంత్రి వేణు గోపాలకృష్ణ తీరుపై ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు బోస్‌.. నియోజకవర్గంలో మంత్రి వేణు సహా ఆయన వర్గీయుల వ్యవహారశైలిని సీఎంకు పిల్లి సుభాష్ వివరించారు. తన అనుచరుడు కోలమూరి శివాజీపై మంత్రి వేణు అనుచరుడు దాడి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని రామచంద్రాపురం నుంచి బరిలో నిలబెట్టాలనే ప్రయత్నాల్లో ఆయన.. మంత్రి వేణుపై జగన్‌ దగ్గర కంప్లైంట్‌ చేయబోయారు.. అయితే, అప్పుడే తీవ్ర స్థాయిలో మండిపడ్డారట సీఎం జగన్‌.. మీ అబ్బాయిని ఎక్కడ నుంచి నిలబెట్టాలనే బాధ్యత నాది కదా అని ప్రశ్నించిన ఆయన.. పార్టీ గెలుపు కోసం రాష్ట్రం అంతా చూడాల్సిన స్థాయిలో ఉండి.. ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోవటం కరెక్ట్ కాదని హితవుపలికారు.. విభేదాలను పక్కనబెట్టి కలిసి పని చేసుకోవాలని సూచించారు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..