NTV Telugu Site icon

CM YS Jagan: కాంగ్రెస్‌ ది డర్టీ గేమ్‌.. అప్పుడు మా చిన్నాన్న.. ఇప్పుడు నా సోదరి..

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: కాంగ్రెస్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తిరుపతిలో ఇండియాటుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ డర్టీ గేమ్‌ ఆడుతుంది.. అది ఆ పార్టీ సంప్రదాయంగా చూస్తున్నాం అని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు.. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు.. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారని మండిపడ్డారు. నేను కాంగ్రెస్‌ నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్న (వైఎస్‌ వివేకానందరెడ్డి)కు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు.. అయినా చరిత్ర నుంచి వారు పాఠాలు నేర్వేలేదు.. ఇప్పుడు ఆ పార్టీ సారథ్య బాధ్యతలు మా సోదరి (వైఎస్‌ షర్మిల)కి ఇచ్చారు.. మా కుటుంబాన్ని విభజించి పాలించాలనే కుట్ర కాంగ్రెస్‌ పార్టీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, అధికారం అనేది దేవుడు ఇచ్చేది.. దేవుడ్ని నేను బలంగా నమ్మతాను.. ఆయనే అన్నీ చూస్తాడు అని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: Apple Smartwatch : మరోసారి ట్రేండింగ్ లో యాపిల్ స్మార్ట్ వాచ్.. ఈసారి గాల్లో ఉండగానే..

ఇక, పేదరికాన్ని నిర్మూలించాలంటే అది నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమని నేను నమ్ముతాను అన్నారు సీఎం జగన్‌.. విద్య మాత్రమే కాదు, నాణ్యమైన విద్య అనే ప్రతి ఒక్కరి హక్కుకావాలన్న ఆయన.. పేదలు ఒక చదువుకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు వేరే చదువులు చదువుతున్నారు.. పేద పిల్లలు కేవలం తెలుగుమీడియంకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు ఇంగ్లిషు మీడియం చదువుతున్నారు.. సంపన్నులకు అందే నాణ్యమైన చదువులు పేద పిల్లలకూ అందాలి.. మా రాష్ట్రంలో పేదపిల్లలకు సంపన్నుల పిల్లలకు అందే చదువులు అందాలన్నదే మా లక్ష్యంగా పేర్కొన్నారు. కేవలం మేం స్కూలు విద్యపైనే కాదు, ఉన్నత విద్యపైనా ప్రత్యేక దృష్టిపెట్టాం.. ఉద్యోగాలు సాధించే కోర్సులను అందిస్తున్నాం.. ఇంటర్నషిప్‌ అందిస్తున్నాం.. ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ అందిస్తున్నాం.. పాఠ్యప్రణాళికలో వీటిని భాగస్వామ్యం చేశాం అని వెల్లడించారు. పిల్లలు ఆన్‌లన్‌లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు 1800 సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం.. బీకాం నేర్చుకునేవారికి అసెట్‌ మేనేజ్‌ మెంట్‌ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం.. ఇవన్నీకూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నాం అని తెలిపారు. రాజకీయాలు వేరే.. పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. వారిపైన పెద్దగా శ్రద్ధ పెట్టరు.. అయితే విద్య అలాంటి అంశాలపై దృష్టిపెట్టకపోతే పేదరికాన్ని నిర్మూలించలేం అని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.