Site icon NTV Telugu

CM YS Jagan: వాళ్లను నమ్మితే కొండచిలువ నోట్లో తలపెట్టినట్టే.. సీఎం జగన్‌ హెచ్చరిక

Jagan

Jagan

CM YS Jagan: సూపర్ 6.. సూపర్‌ 7.. బెంజ్ కార్ హామీలు నమ్మితే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్టే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. బాబా అధికారంలోకి వస్తే వర్షాలు రావు.. రిజర్వాయర్లు ఖాళీ అవుతాయని వ్యాఖ్యానించారు.. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. జనసంద్రంగా మారిన కొత్తూరు జంక్షన్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. జగన్ కు ఓటేస్తే పథకాలు అన్నీ కొనసాగింపు.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు అన్నీ ముగింపు అని వార్నింగ్ ఇచ్చారు. ఇది చంద్రబాబు గత పాలన చెప్పిన సత్యం.. బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమౌతుంది.. గోవిందా.. గోవిందా..!! మనం చెప్పే గోవిందా.. గోవిందా..!! చంద్ర బాబును నమ్మితే ఎలా మోసపోతామో చెప్పే గోవిందా.. గోవిందా..!! వేర్వేరు అన్నారు.. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొరికిపోవడంతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గోవిందా.. గోవిందా..!ఢిల్లీలో రాజీపడ్డంతో ప్రత్యేక హోదా.. విభజన హామీలు గోవిందా.! అన్ని హంగులు వున్న వైజాగ్ వదిలేసిన చంద్రబాబు.. గ్రాఫిక్స్ రాజధాని చూపించాడు.. అది కూడా గోవిందా..! అంటూ ఎద్దేవా చేశారు.

Read Also: Sandeshkhali: బెంగాల్ సర్కార్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే..!

ఇక, చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఒక్క స్కీమ్ ప్రజల్లో లేవు అన్నారు సీఎం జగన్‌.. దోచుకున్న డబ్బులు తో ఓటుకు 2 వేలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారన్న ఆయన.. రూ.3 వేల నుంచి రూ. 5 వేలు ఇవ్వడానికి కూడా సిద్ధం అయ్యారని ఆరోపించారు. చంద్రబాబు ఓటుకు డబ్బులు ఇస్తే తీసుకోండి.. అది మన దగ్గర దోచేసిందే.. ఓటుకు డబ్బులు తీసుకుని.. ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఓటు వేయండి.. జగన్ అధికారంలోకి వస్తేనే పథకాలు అన్నీ వస్తాయి అని పిలుపునిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

Exit mobile version