CM YS Jagan: వాళ్లను నమ్మితే కొండచిలువ నోట్లో తలపెట్టినట్టే.. సీఎం జగన్ హెచ్చరిక
CM YS Jagan: సూపర్ 6.. సూపర్ 7.. బెంజ్ కార్ హామీలు నమ్మితే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్టే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. బాబా అధికారంలోకి వస్తే వర్షాలు రావు.. రిజర్వాయర్లు ఖాళీ అవుతాయని వ్యాఖ్యానించారు.. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. జనసంద్రంగా మారిన కొత్తూరు జంక్షన్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. జగన్ కు ఓటేస్తే పథకాలు అన్నీ కొనసాగింపు.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు అన్నీ ముగింపు అని వార్నింగ్ ఇచ్చారు. ఇది చంద్రబాబు గత పాలన చెప్పిన సత్యం.. బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమౌతుంది.. గోవిందా.. గోవిందా..!! మనం చెప్పే గోవిందా.. గోవిందా..!! చంద్ర బాబును నమ్మితే ఎలా మోసపోతామో చెప్పే గోవిందా.. గోవిందా..!! వేర్వేరు అన్నారు.. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొరికిపోవడంతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గోవిందా.. గోవిందా..!ఢిల్లీలో రాజీపడ్డంతో ప్రత్యేక హోదా.. విభజన హామీలు గోవిందా.! అన్ని హంగులు వున్న వైజాగ్ వదిలేసిన చంద్రబాబు.. గ్రాఫిక్స్ రాజధాని చూపించాడు.. అది కూడా గోవిందా..! అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Sandeshkhali: బెంగాల్ సర్కార్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే..!
ఇక, చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఒక్క స్కీమ్ ప్రజల్లో లేవు అన్నారు సీఎం జగన్.. దోచుకున్న డబ్బులు తో ఓటుకు 2 వేలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారన్న ఆయన.. రూ.3 వేల నుంచి రూ. 5 వేలు ఇవ్వడానికి కూడా సిద్ధం అయ్యారని ఆరోపించారు. చంద్రబాబు ఓటుకు డబ్బులు ఇస్తే తీసుకోండి.. అది మన దగ్గర దోచేసిందే.. ఓటుకు డబ్బులు తీసుకుని.. ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఓటు వేయండి.. జగన్ అధికారంలోకి వస్తేనే పథకాలు అన్నీ వస్తాయి అని పిలుపునిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
తాజావార్తలు
-
మైత్రీ – ప్రశాంత్ నీల్ ‘418’ టైటిల్ పోస్టర్ రిలీజ్ ..
-
PM Modi: మహిళలకు మోడీ బంపర్ ఆఫర్.. ప్రతి మహిళకు ఏటా రూ.36 వేలు! బెంగాల్ వేదికగా ప్రధాని హామీ
-
Prakash Raj: “త్వరలో వస్తున్నా.. మీ అందరికీ సమాధానం చెస్తా”.. “శ్రీరాముడి” వివాదంపై ప్రకాష్ రాజ్ సంచలన స్టేట్‌మెంట్
-
Parshuraam: హోంబలే సినిమాటిక్ యూనివర్స్ నుంచి..పరశురామ్ భారీ అనౌన్స్‌మెంట్!
-
Ajit Agarkar: సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా ఆటగాళ్ల భవిష్యత్తు నిర్ణయించేది ఆయనే!
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!