Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Ys Jagan Review On Floods And Announcement Of Financial Assistance To Flood Victims

CM YS Jagan: వరదలపై సీఎం సమీక్ష.. బాధితులకు ఆర్థిక సాయం ప్రకటన

Published Date :August 3, 2023 , 6:45 pm
By Sudhakar Ravula
CM YS Jagan: వరదలపై సీఎం సమీక్ష.. బాధితులకు ఆర్థిక సాయం ప్రకటన
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM YS Jagan: వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.. క్యాంపు కార్యాలయం నుంచి వరదలపై అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాధిత ప్రాంతాల్లో సమర్థవంతంగా సహాయ పునరావాసం కార్యక్రమాలు జరగాలన్నారు. విమర్శలకు తావులేకుండా చూడాలి.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో కలెక్టర్లు సహా, అధికారులకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నాం.. అవసరమైన వనరులను సమకూరుస్తూ మిమ్మల్ని ఎంపవర్‌ చేస్తున్నాం.. టీఆర్‌-27 నిధులను సకాలంలో విడుదల చేస్తున్నాం అని తెలిపారు. సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా చేపట్టేలా అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా నిలిచింది.. దీని తర్వాత, ఈ పనులు చేయడానికి కొంత సమయం ఇస్తున్నాం.. ఆ తర్వాత నేను వచ్చి ఆయా ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో సహాయ పునరావాస కార్యక్రమాలు ఏరకంగా చేపట్టారో స్వయంగా పరిశీలిస్తున్నాను అని తెలిపారు.

బాధితులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నాను.. ఈ సారి కూడా నేను వస్తాను అని తెలిపారు సీఎం వైఎస్‌ జగన్‌.. క్షేత్రస్థాయిలో మీరు చేపట్టిన చర్యలు, అందించిన సహాయంపై సమీక్ష చేస్తాను.. వరద సహాయ కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించండి అని ఆదేశించారు. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి సహాయం కోరుతామో అలాంటి సహాయమే అందించాలన్న ఆయన.. ఇంట్లోకి వరదనీరు వచ్చినా, అలాగే వరద కారణంగా సంబంధాలు తెగిపోయిన వారికి కచ్చితంగా నిర్ణయించిన రేషన్‌ అందించాలన్నారు. దీంతో పాటు తాగునీరు కూడా అందించాలి.. ఈ సహాయం అదని వరద బాధిత కుటుంబం ఉండకూడదని స్పష్టం చేశారు. సహాయ శిబిరాల్లో ఉండి, వారు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2000, వ్యక్తులైతే రూ.1000లు ఇచ్చి పంపించాలన్న సీఎం.. కలెక్టర్లు బాగా చూసుకున్నారనే మాట వినిపించాలన్నారు. వరద కారణంగా కచ్చా ఇల్లు పాక్షికంగానైనా, పూర్తిగా నైనా ధ్వంసం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరణ చేయొద్దు.. వారందరికీ కూడా రూ.10 వేలు చొప్పున సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

ఇక, వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలను కొనసాగించాలని స్పష్టం చేశారు సీఎం జగన్‌.. వరదనీరు తగ్గగానే పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించండి.. మిగిలిన ప్రాంతాలనుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య కార్మికులను తరలించండి.. పీహెచ్‌సీల్లో, విలేజ్‌ క్లినిక్స్‌లో సరిపడా మందులు ఉండేలా చూసుకోండి.. పాముకాట్లకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచేలా చూసుకోండి.. పంట నష్టం, ఆస్తి నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్‌చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌కోసం జాబితాను ఉంచండిఅంటూ ఆదేశాలు జారీ చేశారు. అత్యంత పారదర్శకంగా పంటనష్టానికి, ఆస్తి నష్టానికి సంబంధించిన పరిహారం అందించండి.. అవసరమైన చోట వెంటనే కొత్త ఇళ్లను మంజూరు చేయండి.. ఏటిగట్లమీద ఉన్నవారికి పక్కా ఇళ్లను మంజూరు చేయండి. వరద వచ్చిన ప్రతిసారి వారు ఇబ్బందిపడకుండా వారికోసం ఇళ్లను మంజూరుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే అన్నారు. అలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో ఉండేవారికి రక్షిత ప్రాంతంలో ఇళ్లు ఇవ్వాలన్నారు. వారికి శాశ్వతంగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత మనది.. అవసరమైన స్థలాన్ని సేకరించి, వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లను మంజూరు చేయండి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు.. పోలవరం ఎగువన తరచుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వండి అని సూచించారు సీఎం జగన్‌.. పశువులకు గ్రాసం కొరతలేకుండా చూడండి.. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు.. తదితర నిర్మాణాల విషయంలో వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సరఫరాను కొనసాగించాలన్నారు. పరిస్థితి మెరుగుపడేంతవరకూ వారికి రక్షిత తాగునీటిని అందించాలన్నారు. వరద బాధిత ప్రాంతాలకు నేను వచ్చినప్పుడు ఈ అంశాలకు సంబంధించి ఎవ్వరూ కూడా ఫిర్యాదులు చేయకూడదన్నారు. సోమ, మంగళవారాల్లో నేను వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తాను.. నేను ఎక్కడకు వచ్చేదీ ఆదివారం సాయంత్రం సీఎంవో అధికారులు వెల్లడిస్తారు.. క్షేత్రస్థాయిలో వరద బాధితులకు అందిన సహాయ, పునరావాసం కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap floods
  • CM YS Jagan
  • financial assistance
  • flood victims

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం!

  • Operation Kill Khamenei: 15 నిమిషాల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం! వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో సంచలన నిజాలు..

  • Trisha: నచ్చినవాడు దొరికితేనే పెళ్లి.. లేదంటే ఒంటరిగానే!

  • Kashmiri Shia Muslims: శ్రీనగర్‌లో కాశ్మీరీ షియా ముస్లింలు.. ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు (వీడియో)

  • Ayatollah Ali Khamenei: ఖమేనీ.. ట్రంప్, నెతన్యాహు కంటే ధనవంతుడా? ఆయన ఎంత కర్సెన్సీని వదిలి వెళ్లాడో తెలుసా!

  • IND vs WI Super 8: వెస్టిండీస్‌కు భారత్ సుస్సు పోసుకోవాల్సిందే.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions