Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Annamayya District Cm Ys Jagan Memantha Siddham Bus Yatra Day 6 Schedule

Memantha Siddham Bus Yatra: 6వ రోజుకు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేడు మదనపల్లెలో జగన్‌ భారీ బహిరంగసభ

Published Date :April 2, 2024 , 7:45 am
By Sudhakar Ravula
Memantha Siddham Bus Yatra: 6వ రోజుకు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేడు మదనపల్లెలో జగన్‌ భారీ బహిరంగసభ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Memantha Siddham Bus Yatra: మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఆరో రోజుకు చేరుకుంది.. సోమవారం రోజు సత్యసాయి జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించింది మేమంతా సిద్ధం యాత్ర.. ఈ రోజు ఉదయం 9 గంటలకు అన్నమయ్య జిల్లా చీకటి మానుపల్లెలోని విడిది కేంద్రం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది.. మొలకల చెరువు, పెద్దపాల్యం, వేపురి కోట మీదుగా బుర్రకాయల కోట క్రాస్, గొల్లపల్లి మీదుగా అంగళ్లకు చేరుకోనుంది బస్సు యాత్ర.. ఇక, సాయంత్రం 3.30 గంటలకు మదనపల్లెలోని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో మేమంతా సిద్ధం బహిరంగ సభ నిర్వహించనుంది వైసీపీ.. ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా పుంగనూరు నియోజకవర్గం అమ్మగారిపల్లె చేరుకోనున్నారు.. అమ్మగారిపల్లె శివారులో ఏర్పాటు చేసిన విడిది కేంద్రం దగ్గర రాత్రి బస చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: Japan Earthquake : జపాన్ లో బలమైన భూకంపం.. భయంతో వణికిపోయిన జనాలు

కాగా, మేమంతా సిద్ధం బస్సు యాత్రకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ప్రజలు.. బస్సు యాత్ర ఐదో రోజు సోమవారం విజయవంతంగా కొనసాగింది. కిలోమీటర్ల కొద్దీ జనం మండే ఎండలను సైతం లెక్కచేయకుండా ఇరువైపులా బారులు తీరి స్వాగతం పలికారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం సంజీవపురంలోని బస కేంద్రం నుంచి సోమవారం ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభించారు. బత్తలపల్లి నుంచి ముదిగుబ్బ మధ్య రామాపురం, కట్టకిందపల్లి, రాళ్ల అనంతపురం సహా పలు గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపైకి చేరుకుని సీఎంకు ఘన స్వాగతం పలికారు. రామాపురంలో బస్సు దిగి సీఎం జగన్‌ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ముదిగుబ్బకు చేరుకునేలోపే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపై బారులు తీరారు. నాగారెడ్డిపల్లి గ్రామస్తులు భారీ గజమాలతో సీఎంకు స్వాగతం పలికారు. ఇక, శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికారు. బస్సుపై నుంచి రోడ్‌షో నిర్వహించిన సీఎం జగన్‌.. పీవీఆర్‌ కళ్యాణ మండపంలో ముస్లిం సోదరులతో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. కదిరి నుంచి నల్లచెరువు, తనకల్లు మండల కేంద్రాల మీదుగా రాత్రి 10 గంటలకు చీకటివానిపల్లె విడిది కేంద్రా­నికి సీఎం జగన్‌ చేరుకున్నా­రు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • Memantha Siddham Bus Yatra
  • Memantha Siddham Bus Yatra Day 6
  • YSRCP

తాజావార్తలు

  • Pineapple Rava Kesari Recipe: నోట్లో వేస్తే వెన్నెల్లా కరిగిపోయే మౌత్ మెల్టింగ్ ‘పైనాపిల్ రవ్వ కేసరి’ చేసేయండి ఇలా..!

  • UAPA: “దేశానికి వ్యతిరేకంగా యుద్ధం”.. కాశ్మీర్ వేర్పాటువాది ఆసియా అంద్రబీకి జీవితఖైదు..

  • Iran Religious Dictatorship: మానవత్వం ఎక్కడో చచ్చిపోయింది.. మేధావులకు రాజకీయాలే ఎక్కువయ్యాయా?

  • Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

ట్రెండింగ్‌

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions