Site icon NTV Telugu

CM YS Jagan: అప్పుడే విశాఖకు.. షిఫ్టింగ్‌పై సీఎం జగన్‌ క్లారిటీ

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు తెరపైకి వచ్చిన తర్వాత.. విశాఖ కేంద్రంగా పాలన సాగించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ముందుగా దసరా నాటికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విశాఖకు షిఫ్ట్‌ అవుతారనే ప్రచారం సాగింది.. కానీ, కొన్ని కారణాల రీత్యా అది సాధ్యం కాలేదు.. అయితే, తాను ఎప్పుడు విశాఖకు షిఫ్ట్‌ అవుతాను అనేదానిపై సీఎం వైఎస్‌ జగనే క్లారిటీ ఇచ్చారు.. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన.. రుషికొండలో ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన అందించనున్నట్టు స్పష్టం చేశారు సీఎం జగన్‌..

Read Also: IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌.. రియల్ గోల్డ్‌ ఐఫోన్‌ పోగొట్టుకున్న ‘బాస్’ హీరోయిన్‌!

త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవుతుందన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఇక, డిసెంబర్‌ లోపు తాను విశాఖకు షిఫ్ట్‌ అవుతానని క్లారిటీ ఇచ్చారు. పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుందన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖపట్నం అని వెల్లడించారు.. ఇప్పటికే ఎడ్యుకేషన్‌ హబ్‌గా విశాఖ మారింది.. అన్ని రంగాల్లో విశాఖ అభివృద్ధి చెందుతోందన్నారు. ఇక, హైదరాబాద్‌, బెంగళూరు మాదిరిగా విశాఖపట్నంలోనూ విస్తారమైన అవకాశాలు ఉంటాయని తెలిపారు సీఎం.. వైజాగ్‌ కూడా ఐటీ హబ్‌గా మారుతుందన్నారు.. ప్రతీ ఏడాది 15వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, విస్తారమైన తీర ప్రాంతం విశాఖ సొంతం.. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు.. ఇక పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఒక్క ఫోన్‌ కాల్‌తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కల్పిస్తాం అని ప్రకటించారు.. ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Exit mobile version