IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. రియల్ గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న ‘బాస్’ హీరోయిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urvashi Rautela Lost 24 Carat Gold iPhone during India vs Pakistan Clash: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా గత శనివారం (అక్టోబర్ 14) అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు పలువురు సెలబ్రెటీలు హాజరై సందడి చేశారు. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా కూడా ఇండో-పాక్ మ్యాచ్‌కు వచ్చారు. ఎప్పటిలానే ఊర్వశీ మ్యాచ్ ఆసాంతం భారత జట్టును సపోర్టు చేశారు. స్టేడియంలో అభిమానులతో కలిసి తెగ సందడి చేశారు. అయితే నరేంద్ర మోడీ స్టేడియంలో ఊర్వశీ తన ఖరీదైన ఫోన్‌ను పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా ద్వారా తెలిపారు.
‘అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నా 24 క్యారెట్ల బంగారు ఐ ఫోన్ పోయింది. ప్లీజ్ నాకు సహాయం చేయండి. ఎవరికైనా దొరికితే వెంటనే నన్ను సంప్రదించండి’ అని బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు సాయం చేయాలని కోరుతూ అహ్మదాబాద్ పోలీసులను ట్యాగ్ చేశారు. ఊర్వశీ పోస్ట్‌కు స్పందించిన పోలీసులు ఫోన్ వివరాలు చెప్పాలని రిప్లై ఇచ్చారు. మరోవైపు తన ఐ ఫోన్ పోయినట్టు పోలీస్ స్టేషన్‌లోనూ ఊర్వశీ ఫిర్యాదు కూడా చేశారు.
Also Read
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
Also Read: World Cup 2023: బలమైన బ్యాటింగ్, హడలెత్తించే బౌలర్లు.. అయినా ప్రపంచకప్ 2023లో ఖాతా తెరవలేదు!
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఊర్వశీ రౌతేలా తన ఐ ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత చాలా మంది ప్రేక్షకులు ఆమెతో సెల్ఫీలు దిగడం కోసం ఎగబడ్డారు. ఆ సమయంలోనే ఆ ఐ ఫోన్ పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఊర్వశీ తెలుగు సినిమాల్లో వరుసగా ఐటెమ్ సాంగ్స్ చేస్తున్నారు. తాజాగా ‘స్కంద’ సినిమాలో ‘కల్ట్ మామా’ అనే పాటకు ప్రేక్షకులను అలరించారు. అంతకుముందు ఏజెంట్, వాల్తేరు వీరయ్య, బ్రో సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేశారు.
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!