NTV Telugu Site icon

CM YS Jagan: పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక అంతే.. జగన్‌ వార్నింగ్‌

Jagan

Jagan

CM YS Jagan: ఎన్నికల్లో జగన్ కి ఓటు వేస్తే పథకాలను కొనసాగింపు.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు అంటూ మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. మరో 10 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది.. జరగబోయే ఎన్నికలు కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిపించడానికి మాత్రమే కాదు.. ఇంటింటి సంక్షేమం పథకాల కొనసాగింపు కోసం అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే అమలు చేయడానికి సాధ్యం కానీ హామీలతో మోసపోతారని హెచ్చరించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే ఐదేళ్లపాటు మీ రక్తం తాగేందుకు చంద్రముఖి వస్తుందన్నారు. 14 ఏళ్ల పాటు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశా అంటున్న చంద్రబాబు పేరు చెబితే.. రాష్ట్రంలో ఏ పేదలకు ఒకటంటే ఒక్క మంచి గుర్తుకురాదన్నారు. గత ప్రభుత్వాల్లో అవ్వాతాతల ఇంటికి నేరుగా 3000 పెన్షన్ గతంలో ఎప్పుడైనా అందిందా..? అని నిలదీశారు. 59 నెలల కాలంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వెల్లడించారు సీఎం జగన్‌.

Read Also: Minister Seethakka: దేవుళ్ల పేరుతో బీజేపీ రాజ‌కీయం చేస్తూ.. దేవుళ్లకే శ‌ఠ‌గోపం పెట్టింది..

చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి పనైనా చేశారా? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. అలాగే, చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా?.. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్‌ వార్‌ అని పేర్కొన్నారు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌ నరసాపురంలో రోడ్‌ షో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం, బైజూస్‌ కంటెంట్‌. ఇంగ్లీష్‌ మీడియంతో అడుగులు సీబీఎస్‌సీ నుంచి ఐబీ వరకు కనపడుతుంది. ఆరో తరగతి నుంచే క్లాస్‌రూమ్‌లో డిజిటల్‌ బోధన అందుతోంది. ప్రభుత్వ స్కూల్స్‌ విద్యార్ధులకు బైలింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌. రాష్ట్రంలో ఉన్న 93 శాతం పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌. జగనన్న విద్యాదీనెన, వసతి దీవెన మీ బిడ్డ పాలనలోనే వచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో అంతర్జాతీయ విద్యా కోర్సులు తెచ్చామని వెల్లడించారు..

Read Also: Patang: యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప‌తంగ్ అంద‌రి మ‌న‌సుల‌కు హ‌త్తుకుంటుంది..

ఇక, మీ బిడ్డ వైఎస్‌ జగన్‌.. అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడు అని తెలిపారు ముఖ్యమంత్రి.. అక్కాచెల్లెమ్మలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఆసరా, సున్నావడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నాం. అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం అన్నారు.. రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిబీ అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం. ప్రతీ రంగంలోనూ విప్లవం తీసుకువచ్చామని పేర్కొన్నారు.. మరోవైపు.. పేదవాడి వైద్యం కోసం రూ.25లక్షల వరకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. పేషంట్‌ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాం. ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌, విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాం అన్నారు.. జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు సాయం అందించాం. గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తెచ్చాం. రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేశాం. రెండు లక్షల 31వేల ఉద్యోగాలిచ్చామని గుర్తుచేశారు సీఎం వైఎస్‌ జగన్‌.