Patang: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా పతంగ్ అందరి మనసులకు హత్తుకుంటుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు భారతీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి వుంటారు. కాని తొలిసారిగా పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. మరికొంత మంది నూతన నటీనటులతో పాటు ప్రముఖ సింగర్, నటుడు ఎస్‌పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం టీజర్‌ను గురువారం ప్రసాద్ ఐమ్యాక్స్‌లో జరిగిన వేడుకలో గ్రాండ్‌గా విడుదల చేశారు.
Also Read; Pawan Kalyan :సీన్ లోకి హరిహర వీరమల్లు.. మరి ‘ఓజి’ రిలీజ్ పరిస్థితి ఏంటి..?
Also Read
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సంచలన దర్శకుడు ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌తో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్న బుచ్చిబాబు సానా టీజర్‌ను విడుదల చేశారు. మరో అతిథి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఈ సినిమా కాంటెస్ట్‌లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ప్రణీత్ పత్తిపాటి, ఆటా సందీప్ మాస్టర్, మాజీ ప్లార్లమెంట్ సిరిసిల్ల రాజయ్య, నటి శాన్వి, రవిప్రకాష్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాబుచ్బిబాబు మాట్లాడుతూ కంటెంట్ చూస్తుంటే సినిమా షూర్ షాట్ హిట్ అనిపిస్తుంది. ఈ సినిమాకు ఆయూత్‌ఫుల్ వైబ్ కనిపిస్తుంది. మరో హ్యపీడేస్‌లా ఘనవిజయం సాధిస్తుందన్న అనిపిస్తుంది. నాని నేను మా గురువు గారు సుకుమార్ దగ్గర పనిచేస్తున్నప్పుడు నాకు తెలుసు. మంచి టెక్నికల్ నాలెడ్జ్ వుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచి పేరును తీసుకరావాలిఅన్నారు.దర్శకుడు ప్రణీత్ మాట్లాడుతూ సినిమా టీజర్ నచ్చితే అందరికి సినిమా నచ్చినట్టే. ఒక తెలుగు కమర్షియల్ సినిమాలో వున్న ఎలిమెంట్స్ వున్నాయి. తప్పకుండ సినిమా నచ్చుతుంది. టీజర్ లో చెప్పినట్లుగా మ్యాచ్‌లో కలుద్డాం అన్నారు.
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!