NTV Telugu Site icon

Siddham: పేదవాడి భవిష్యత్తు మారాలంటే జగనే రావాలి

Siddham

Siddham

Siddham: పేదవాడి భవిష్యత్తు మారాలంటే మళ్లీ జగనే రావాలి అని స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది.. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చాయి వైసీపీ శ్రేణులు.. సిద్ధం పేరుతో నిర్వహించిన ఈ సభా వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం వైఎస్‌ జగన్‌.. మన టార్గెట్‌ 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే అని స్పష్టం చేసిన ఆయన.. ప్రతి పక్షాలకు ఓటేయడం అంటే దాని అర్ధం.. మాకు ఈ స్కీములు వద్దని, ఈ స్కీములకు రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని గ్రహించాలి.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. మన సంక్షేమ ఫలాలు అందుకునే ప్రతీ వ్యక్తి మనకు స్టార్ క్యాంపెయినరే.. వాళ్లను మరికొంతమందికి చెప్పేలా ప్రోత్సహించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం జగన్‌.. మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి.. పేదల భవిష్యత్‌ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి.. ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే జగన్‌ రావాలని చెప్పండి.. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్‌ రావాలంటే.. జగన్‌ గెలవాలని చెప్పండి.. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే.. జగన్‌ సీఎం అవ్వాలని చెప్పండి.. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమ్మల్ని మాత్రమే.. ప్రజలే.. నా స్టార్‌ క్యాంపెయినర్లు అని సీఎం పేర్కొన్నారు.

Read Also: Breaking News: సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భూకంపం.. 5 సెకన్లు కంపించిన భూమి

ఇక, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం ఏం సంక్షేమం అందించిందో మీ బ్యాంక్‌ అకౌంట్‌లు చూస్తే అర్ధమవుతుంది.. ఏ ఒక్క రూపాయి అయినా సంక్షేమం ద్వారా అందించారా? అని వారినే అడగండి అని సూచించారు సీఎం జగన్‌.. మళ్లీ అడగండి.. 2019 నుంచి 2024 వరకూ మీ జగన్‌ ప్రభుత్వం అందించిన సొమ్మును చూడమనండి.. రూ. 2 లక్షల 53 వేల కోట్లు వేశాం.. కోవిడ్‌ కష్టకాలంలో సాకులు వెతకకుండా సంక్షేమాన్ని అందించాం అన్నారు.. వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్జీటీసీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్లు, కార్పోరేటర్లు, నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ఇలా ప్రతి ఒక్కరికీ ఒక్కటే చెబుతున్నా.. ఇది మీ పార్టీ.. ఇది ఒక జగన్‌ పార్టీ కాదు.. మీ అందరి పార్టీ అన్నారు. వైఎస్సార్‌సీపీలో ఉన్నవారు.. వైఎస్సార్‌సీపీ కోసం కష్టపడ్డవారందరికీ కూడా ఏ రాజకీయ పార్టీ ఇవ్వని గౌరవం ఇచ్చాం అన్నారు. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం.. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం. రైతులకు తోడుగా ఆర్‌బీకేలను నిర్మించాం.. ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట​్‌ తీసుకొచ్చాం.. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం అని వివరించారు..