NTV Telugu Site icon

CM Revanth Reddy: ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్

Cm Revanth Reddy

Cm Revanth Reddy

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అందరికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. 21వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని విద్యార్థులకు సూచించారు. సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహిస్తోందని.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే అకడమిక్ ఇయర్ లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. చదువుతో పాటు స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

READ MORE: US Election Results: మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ట్రంప్.. ఏకపక్షంగా మొగ్గుచూపిన అమెరికన్లు

టాటా ఇనిస్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని.. సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కల్పిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. “చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి.. విద్యార్థులు క్రీడల్లో రాణించాలని వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం.వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇవాళ్టి విద్యార్థులు రేపటి పౌరులుగా మారి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. సచివాలయం రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఉన్నత చదువులు చదివి భవిష్యత్ లో మీరు సచివాలయంలో అడుగు పెట్టాలని… పరిపాలనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నా. గంజాయి, డ్రగ్స్ ఎక్కడ కనిపించినా 100కు డయల్ చేసి సమాచారం అందించండి. వ్యసనాలకు బానిసైతే జీవితాలు నాశనం అవుతాయి. ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతను అలవరచుకోవాలి. 14 నవంబర్ న 15వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమం తీసుకుంటున్నాం. అదే రోజు ఫేజ్-2 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేయబోతున్నాం..” అని సీఎం తెలిపారు. ప్రభుత్వ వ‌స‌తిగృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Show comments