ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే ఈ వేడుకల్లో అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అందరికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. 21వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు.