NTV Telugu Site icon

CM Revanth Reddy : వక్ఫ్ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం

Cm Revanth Reddy

Cm Revanth Reddy

చెరువుల కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై హరీష్ రావుతో ఓ కమిటీ వేద్దాం.. అక్రమ నిర్మాణాలు దగ్గర ఉండి కూల్చివేద్దామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. మీడియాతో నిర్వహించిన చిట్‌ చాట్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మేము చేస్తున్న మంచి పనులు చూసి పార్టీలోకి వస్తాం అంటున్నారు. భయపెట్టి, బ్రతినిలాడి ఎవర్నీ పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో కేస్ బై కేస్ విచారణకు సీబీఐకి అనుమతి ఇచ్చామన్నారు. వక్ఫ్ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని ఆయన తెలిపారు. 111జీవో గత ప్రభుత్వం ఎత్తివేయ లేదు. ఆ జీవో అలానే ఉంది. ఆ జీవో రద్దు చేయాలంటే సుప్రీంకోర్టు, ఎన్జీటిల అనుమతి ఉండాలన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. సుంకిశాలపై విచారణ జరుగుతుందని, 16 నెలలు జైల్లో ఉన్న సోసిడియా, ఇంకా జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు రాని బెయిల్ ఐదు నెలలు జైల్లో ఉన్న కవితకు బెయిల్ ఎలా వచ్చింది? అని ఆయన అన్నారు.

 CM Revanth Reddy : వక్ఫ్ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం
అంతేకాకుండా..’ఎంపి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదలాయింపు చేశారు. అందుకే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో బీఆర్ఎస్ కు ఓట్లు తగ్గాయి. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపి సీట్లను త్యాగం చేసింది. బీఆర్ఎస్ కు ఒకరమైన న్యాయం… మిగతా వారికి మరొకరమైన న్యాయం జరుగుతుంది. కేసీఆర్ నాలుగు విడతల్లో 23లక్షల 61 వేల 899 మంది ఖాతాల్లో 13వేల 329 కోట్ల రుణమాఫీ చేశారు. ఒక్క నెలలో 22 లక్షల 37 వేల 848 ఖాతాల్లో 17వేల 933 కోట్ల రుణమాఫీ చేశాం. రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేశాం. రెండు లక్షలకు పైన రుణాలు తీసుకున్న రైతులు కూడా ఆపైన డబ్బులు బ్యాంకుల్లో కడితే వారికి కూడా రుణమాఫీ అవుతుంది. ఎవరెవరికి రుణమాఫీ కాలేదో కేటీఆర్, హరీష్ లు గ్రామగ్రామాన తిరిగి వివరాలు సేకరించి.. కలెక్టర్లకు ఇవ్వాలి. ఆగస్టు 31కి కొత్త బిసి కమిషన్ ఏర్పాటు చేస్తాం. విభజన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్నాం. విభజన సమస్యల పరిష్కారం కోసం అధికారుల కమిటీ ఏర్పాటు చేసాం. త్వరలో ఆ కమిటీ సమావేశం అవుతుంది.

David Malan: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్..

పదేళ్లు బీఆర్ఎస్ కు తెలంగాణ తల్లి పై సోయి లేదు. సచివాలయం నిర్మించినప్పుడే తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదు? తెలంగాణ ప్రతిరూపం, దర్పం ఉట్టిపడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. వాళ్లా మాకు నీతులు చెప్పేది.?. మల్లారెడ్డి, పళ్ల, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు ఎవరైనా హైడ్రాకు సమానమే. అక్రమ నిర్మాణాలు చేసిన వారిని బీఆర్ఎస్ సస్పెండ్ చేయాలి. అక్రమ నిర్మాణాలపై అవసరమైతే ప్రజా కోర్ట్ పెడదాం. బీఆర్ఎస్ కు నిజాన్ని నిరూపించుకునేందుకు మంచి అవకాశం. అక్రమ నిర్మాణలు ఉంటే నా ఫ్యామిలీ దైనా నేనే కులగొట్టిస్తా. నేను జన్వాడ బయట పెట్టినట్లు… కేటిఆర్ ఆధారాలతో రావాలి’ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.