NTV Telugu Site icon

CM Revanth Reddy: అల్లు అర్జున్‌ కాలు పోయిందా.. కన్ను పోయిందా.. దేనికి పరామర్శలు..?

Revanth

Revanth

సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ అంశం మీద సంచలన విషయాలు బయట పెట్టారు. ఓ సినీనటుడిని అరెస్ట్‌ చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, ఈ ఘటనలో అల్లు అర్జున్‌ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సంధ్య థియేటర్లోకి హీరో వచ్చేందుకు అనుమతి ఇవ్వలేదని ఒక్కటే దారి ఉంది కాబట్టి హీరో హీరోయిన్ రావద్దని చెప్పామని అన్నారు. హీరో కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే సరిపోయేది కానీ రోడ్ షో చేసుకుంటూ వచ్చాడని దానికి కారణంగా వేలాదిమంది వచ్చారని అన్నారు. ఆ కారణంగానే రేవతి ఒకపక్క ఆమె కుమారుడు ఒక పక్కకు వెళ్లిపోయారని వేలాదిమంది రాక కారణంగా తొక్కిసలాట జరిగి కన్న బిడ్డను పట్టుకునే ప్రయత్నంలో రేవతి చనిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. రేవతి కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడని ఆయన అన్నారు.

Odela 2 : ‘ఓదెల 2’ నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

ఈ ఘటన జరిగిన సమయంలో హీరో హాల్లోనే ఉన్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. థియేటర్ వాళ్ళు కూడా పోలీసులు కంట్రోల్ చేయకుండా చేశారని పోలీసులను కూడా హీరోకు విషయం చెప్పడానికి వెళ్తే పోనివ్వలేదు అన్నారు. ఏసీబీకి కోపం వచ్చి అందరినీ లోపల వేస్తానంటే అప్పుడు లోపలికి పంపారని అన్నారు అప్పుడు పోలీసులు వెళ్లి సినిమా హీరోని థియేటర్ నుంచి పంపించి వేశారని అన్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హీరో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేశారని ఆయన అన్నారు. అంతే కాదు విచారణ కోసం వెళితే పోలీసుల పట్ల హీరో దురుసుగా ప్రవర్తించారని ఆయన అన్నారు. హీరోని స్టేషన్ కి తీసుకువెళ్లాక కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఎంతో నీచంగా పోస్టులు పెట్టారని ఆయన అన్నారు.

రేవతి చనిపోతే 11 రోజుల వరకు ఎవరూ పరామర్శకు వెళ్లలేదు ఇదా మానవత్వం అంటూ ఆయన ప్రశ్నించారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఆయన నాపైన అడ్డగోలుగా ట్వీట్ చేశాడంటూ కేటీఆర్ మీద ఆయన ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఉద్యమం చేస్తున్నప్పుడు సినిమాలు తీయనీయలేదు అంటూ ఆయన విమర్శించారు. అంతేకాదు పుష్ప 2 సినిమాకు స్పెషల్ షో అనుమతి ఇచ్చింది నేనేనని సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఆ అనుమతి ఇచ్చామని అన్నారు. హీరో బయటకు వచ్చాక సినిమా వాళ్ళందరూ అతని ఇంటికి క్యూ కట్టారు కానీ తల్లి చనిపోయి ఆసుపత్రిలో కోమాలో ఉన్న వారిని సినీ ప్రముఖులు పరామర్శించారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అల్లు అర్జున్‌ కాలు పోయిందా.. కన్ను పోయిందా.. దేనికి పరామర్శలు..? ఆస్పత్రిలో ఉన్న బాలుడిని మాత్రం ఎందుకు పట్టించుకోరు? రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Show comments