CM Revanth Reddy: కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..

  • మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో అధికారులు
  • ప్రజాప్రతినిధుల సీఎం రేవంత్ సమీక్ష
  • కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు
  • డిసెంబర్ 2025లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాల్సిందే..
  • ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించండి- సీఎం
  • గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
Cm Revanth Reddy

Cm Revanth Reddy

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఐడిఓసిలో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్లపై సమీక్ష చేపట్టారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై సమీక్ష కొనసాగుతుంది. ప్రాజెక్టుల స్థితిగతుల గురించి ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు.

Read Also: Kathua Ambush: కథువా ఉగ్రదాడికి ప్రతీకారం తప్పుడు.. పాక్‌కి భారత్ వార్నింగ్..

మరోవైపు.. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. డిసెంబర్ 2025లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాల్సిందేనని తెలిపారు. ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించండి.. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రతీ నెలా ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలని కోరారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Read Also: Beerla Ilaiah: ప్రజల పేగు బంధాన్ని తెంచిందే కేసీఆర్.. బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు